నెహ్రూతో కలిసే ఆ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ విలీనం ఖ్యాతి ఒక్కరికే అంటగట్టొద్దు కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్‌పై సైనికచర్య పటేల్ సొంత నిర్ణయం కాదని, నెహ్రూతో కలిసి తీసుకున్న నిర్ణయమే అని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి గుర్తుచేశారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ నెహ్రూ, పటేల్‌ కాంగ్రెస్‌కు రెండు కళ్లలాంటివారన్నారు. పటేల్‌ను పొగడటంలో తప్పు లేదు కానీ నెహ్రూను కించపరచడం సరికాదన్నారు. క్విట్ ఇండియాలో బ్రిటీష్‌వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ తొత్తుగా పనిచేసిందని ఆరోపించారు. కశ్మీర్‌లో పరిస్ధితి దిగజారడానికి మోదీనే కారణమని మండిపడ్డారు. అమిత్‌ షా ఓ గల్లీ పొలిటీషన్ అని కేంద్రమాజీమంత్రి జైపాల్ ‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.