Asianet News TeluguAsianet News Telugu

‘‘జై తెలంగాణ’’ పోలీసు శ్రీనివాస్ గౌడ్ పై మళ్లీ వేటు

తెలంగాణ  ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణమది. తెలంగాణ పది జిల్లాల్లో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు అంతా ఉద్యమంలోనే ఉన్నారు. అదే సమయంలో హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో ఎపి ఎన్జిఓలు సభ పెట్టారు. ఆ సభలో ఓ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేస్తూ హల్ చల్ సృష్టించాడు. దీంతో తోటి కానిస్టేబుళ్లు అతడిపై పిడిగుద్దులు గుద్ది అదుపులోకి  తీసుకున్నారు. వెంటనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అతడిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది. ఉద్యోగమిచ్చింది. ప్రమోషన్ కూడా ఇస్తామన్నది. ఇంతలోనే శ్రీనివాస్ గౌడ్ పై మల్లా సస్పెన్షన్ వేటు పడింది.

Jai Telangana fame cop Srinivas Goud suspended again

 

 

ఉమ్మడి రాష్ట్రంలో సస్పెన్షన్ కు గురైన శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ వచ్చిన తర్వాత రెండేళ్ల క్రితం తెలంగాణ సర్కారు కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చింది. సిద్ధిపేట హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అనూహ్యంగా ఈనెల 25న ఆదివారం ఉన్నతాధికారులు అతనికి సస్పెన్షన్ కాగితం చేతిలో పెట్టారు. తన ఆవేదనను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు శ్రీనివాస్ ఆ పోస్టును ఉన్నది ఉన్నట్లు ఇక్కడ ఇస్తున్నాము.

 

తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించి,40 వేల మందికి భయపడని నా గొంతు,ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక న్యాయం, ధర్మం వైపు నిలబడితే సస్పెండ్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కొంత మంది అధికారుల విజ్ఞతకే వదిలివేస్తున్న.నన్ను సస్పెండ్ చేయడానికి కారణాలు

 

1)head quarters లో wepon తో కాక్ చేసిండు,ఒక out sourcing employee పై aim చేసి చంపుతా అని దుర్బాషలాడిండు..(ఇది పచ్చి అబద్ధం.పైన ఆ వ్యక్తితో రాయించి తీసుకొచ్చిన లెటర్.మరి దీనికి సమాధానం వాళ్లే చెప్పాలి)

 

2)un discipline.ఉద్యోగం సక్కగా చెయ్యడు.(ఉద్యోగం సక్కగా చెయ్యకపోతే,మా GD Roster ఉంటది దయచేసి ఆ GD Roster క్షుణ్ణంగా పరిశీలించాలి.లేనిచో మీ పై ఉన్నత అధికారులకు నేను ఫిర్యాదు చేస్తాను)

 

3)కుకునూర్ పల్లి SI Sir హత్య/ఆత్మహత్య అనే విషయాన్ని fb లో పోస్ట్ పెట్టిన.ఇది వాస్తవం...మరి ఆ పోస్ట్ లో తప్పేముందో వాళ్ళకే అర్ధం కావాలి..ఒక అధికారి చనిపోతే పూర్తి వివరాలు ప్రజలకు,ప్రభుత్వానికి తెలియజేసి మన వ్యవస్థ పై నమ్మకం ను కలిగించాలి కానీ అనుమానాలను కలిగించి ప్రభుత్వానికి చెడు పేరు తేవద్దు అనే ఉద్దేశ్యం తో పెట్టిన పోస్ట్...

 

4)నేను తప్పు చేస్తే పై అధికారుల వద్దకి తీసుకెళ్లి విచారణ చేసి నా వ్యక్తిత్వంని,నా యొక్క behaviour ని తెలుసుకొని నా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.కానీ ఇలా సస్పెండ్ చేస్తే మంచి వాడు కాస్త చెడ్డవాడిగా మారే ప్రమాదం ఉంటుంది..

 

5)Tv 9 లో ప్రసారమైన కుకునూర్ పల్లి దందా లో సిద్దిపేట సీపీ సర్ నుండి మొదలు పెడితే కొంతమంది అధికారుల వరకు లంచాలు,అవినీతి సాక్షాలతో బయటపెట్టడం జరిగింది.మరి వాళ్ల పై చర్యలు ఉండవా?

 

6)CI భూమయ్య సర్ ఈ సీపీ గారి వేధింపులకు అతడి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నా కూడా సీపీ గారి పై చర్యలు ఎందుకు తీసుకోలేదు...

 

7)AR Hqrs లో Ri గారి అక్రమాలకు అంతే లేదు...అతడిపై చాలా సార్లు పై అధికారులకు తెలియజేసిన కానీ ఇట్లాంటి వ్యక్తి ని వదిలి నిజాయితితో,న్యాయంగా,ధర్మం గా బతికే నాలాంటి వాళ్లపై అక్రమ అరెస్టులు,బట్టకాల్చి మీదవేసే చర్యలు,అబద్ధాలు ఆడడం మంచిది కాదు..

 

నేను న్యాయ పోరాటానికి సిద్ధం...

జై తెలంగాణ,జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్...9000424673

Follow Us:
Download App:
  • android
  • ios