జగిత్యాలలో మూడు రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆ యువకుడిని చంపేసినట్టు వివరించారు.
హైదారాబాద్: జగిత్యాల మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం జరిగిన హత్య గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె భర్త, తన మిత్రుడి సహాయం తీసుకుని ఆ యువకుడిని చంపేశాడు. అనంతరం, డీ 40 కాలువలో పడేశారు. ఈ మృతదేహం లభించింది.
జగిత్యాలలోని బీముని దుబ్బలో నివసించే షేక్ సమీర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అంబేద్కర్ నగర్‌కు చెందిన కండ్లె ఈశ్వర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది. షేక్ సమీర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించాడు. నిజామాబాద్ మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఫ్రెండ్ ఉట్నూర్ బాలా శంకర్‌ను పిలిపించుకున్నాడు. షేక్ సమీర్‌ను చంపాలనే ప్లాన్ వేసుకున్నారు.
Also Read: గద్దర్ మరణంపై మావోయిస్టుల లేఖ.. గద్దర్‌పై బుల్లెట్లు షూట్ చేసింది ఎవరంటే?
ఈ నెల 2వ తేదీన వీరిద్దరూ డీ 40 కాలువ వద్దకు షేక్ సమీర్‌ను పిలిపించుకున్నారు. మద్యం తాగారు. ఆ తర్వాత అనుకున్న ప్రకారమే సమీర్‌తో గొడవ, అనంతరం, వెంట తెచ్చుకున్న నైలాన్ తాడును ఉట్నూర్ బాలా శంకర్, ఈశ్వర్‌లు సమీర్ మెడ చుట్టూ చుట్టి లాగారు. మరణించిన తర్వాత సమీర్ మృతదేహాన్ని, బైక్‌ను డీ 40 కాలువలో తోసేశారు. అయితే, సమీర్ సోదరుడి అనుమానంతో ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. దీంతో హత్య చేసినట్టు ఈశ్వర్ అంగీకరించాడు. తన భార్యతో సమీర్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని అనుమానించాడని, అందుకే చంపేశానని చెప్పాడు.
