Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం... ప్రభుత్వ టీచర్‌పై సస్పెన్షన్ వేటు

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయుడే దారితప్పాడు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లల బాగోగులను గాలికొదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పూట గడవటం కష్టంగా మారిన ఆ ఇల్లాలు భర్తపై ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసింది.

jagityal collector takes action on school teacher

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాద్యాయుడే దారితప్పాడు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లల బాగోగులను గాలికొదిలేసి వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పూట గడవటం కష్టంగా మారిన ఆ ఇల్లాలు భర్తపై ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసింది. భాద్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా నీచ ప్రవర్తన కల్గిన టీచర్ ప్రవర్తనపై ఆగ్రహానికి గురైన జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు బాధిత మహిళకు కుటుంబ ఖర్చులకు ఐదువేల రూపాయలు ఇచ్చి తన ఉధారతను చాటుకున్నారు. 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో తులసి ఆగమయ్య ఎస్జీటి టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి 20 ఏళ్ల క్రితం రామడుగు ప్రాంతానికి చెందిన పద్మతో వివాహమైంది. వీరికి వెన్నెల(16), క్రాంతి(11) పిల్లలు.

అయితే ఆగమయ్య అదే ప్రాంతానికి చెందిన  మహిళతో గత కొంత కాలంగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో భార్యా, పిల్లలను బాగోగులు పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నించినందుకు భార్య ను పిల్లలతో కలిపి ఇంట్లోంచి గెంటేశాడు. దీంతో పాపం దిక్కుతోచని పరిస్థితుల్లో చేసేదేమి లేక  పద్మ తన
స్వగ్రామమైన చిప్పకుర్తిలోని తల్లివద్దకు చేరుకుని కూతురు, కుమార్తెలను చదివిపిస్తోంది. 

భర్త ఆగమయ్య ప్రవర్తనపై పద్మ విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఏకంగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసింది. తన పిల్లలతో కలిసి ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లిన పద్మ...కలెక్టర్ శరత్ కు తన పిర్యాదును అందించింది. దీనిపై స్పందించి ఆయన వెంటనే సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని జేసి రాజేశంకు కలెక్టర్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios