జగిత్యాల: సిటిజన్ ట్రాకింగ్ కోవిడ్-19 అనే పేరుతో జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ కొత్త యాప్ ప్రారంభించారు. అనవసరంగా రోడ్డెక్కిన, నిత్యావసర సరుకుల కోసం మూడు కిలోమీటర్ల పరిధిని దాటి నిబంధనలు ఉళ్ళంఘిస్తున్న వారిపై కేసులు బనాయిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారి యొక్క వివరాలు ఈ యాప్ లో పొందుపర్చనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుండే జిల్లాలో ఈ యాప్ అమల్లో వుంటుందని సింధుశర్మ వెల్లడించారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. ఇళ్లనుండి బయటకు వస్తే మాస్కులు ధరించాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 414 నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో  కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంది.

ఇక నుండి ఇళ్ల నుండి బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులను ధరించాలని ప్రభుత్వం శుక్రవారం నాడు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.ఎక్కువ మందికి కరోనా లక్షణాలు సోకిన లక్షణాలు లేనందున మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 తొలగించిన మాస్కులను మూత ఉన్న చెత్త డబ్బాలోనే వేయాలని ప్రభుత్వం సూచించింది. మాస్కులు తొలగించిన తర్వాత శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని ఎలా నిరోధించాలనే అంశంతో పాటు ఇతర విషయాలను చర్చించేందుకు గాను తెలంగాణ కేబినెట్ ఈ నెల 11 వ తేదీన సమావేశం కానుంది.