సంగారెడ్డి: మైనారిటీ గర్జన సభలో కాంగ్రెస్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి భార్య నిర్మల కన్నీరు మున్నీరయ్యారు. జగ్గారెడ్డి లేకున్నా ఇంతమంది మైనారిటీలు సభకు వచ్చారని, వారందరి హృదయాల్లో జగ్గారెడ్డి ఉన్నారని ఆమె అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారంనాడు సంగారెడ్డిలో మైనారిటీ గర్జన సభ జరిగింది. ఈ సభకు జగ్గారెడ్డి భార్య నిర్మల,  తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. 

మచ్చలేని మనిషి జగ్గారెడ్డి అని ఈ సభలో నిర్మల అన్నారు. ఇవాళ సభలో జగ్గారెడ్డి లేకపోవడానికి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసునని అంటూ వారికి మీరే బుద్ధి చెప్పాలంటూ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి జగ్గారెడ్డిపై కక్ష కట్టారని అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుస్తారనే కేసీఆర్, హరీష్ రావు, చింత ప్రభాకర్ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. 

వాళ్లేమైనా సుద్ద పూసలా..? తప్పు చేయలేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, దొరల పాలనలో బానిసల్లా బ్రతుకుతున్నామని అన్నారు. జగ్గారెడ్డిపై కుట్రలు చేసిన వారికి తనకు పట్టిన గతే పడుతుందని అన్నారు

ఈ వార్తాకథనాలు చదవండి

జగ్గారెడ్డిపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధం

జగ్గారెడ్డి అరెస్టు (ఫొటోలు)

జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు (వీడియో)

మాకు పాస్‌పోర్టులే లేవు: జగ్గారెడ్డి భార్య నిర్మల

జగ్గారెడ్డి అరెస్టు: మనుషుల అక్రమ రవాణా కథా కమామిషు

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు