శనివారం అసెంబ్లీ స్పీకర్ ఏకగ్రీవం సమావేశమైన టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కేటీఆర్ ల మధ్య కొనసాగిన సరదా సంభాషణ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఇక్కడితోనే పుల్ స్టాప్ పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రయత్నించారు. అందుకోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారో జగ్గారెడ్డి బయటపెట్టారు. 

టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత సైన్యంలో పనిచేసి వచ్చిన నిజాయితీగల  వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తి కాదని...కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకే  కేటీఆర్ కు ఫోన్ చేశాడని అన్నారు. అదే  విషయంపై శనివారం జరిగిన సమావేశంలో కేటీఆర్ తో మాట్లాడినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఉత్తమ్‌పై తమకు పూర్తి నమ్మకముందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరూ బయటికి పోరని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో చాణక్య నీతితో ముందుకెళతామని...దీంతో రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికీ బలంగా వుందని...త్వరలో ఆ బలం బయటపడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని...అందుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ని  బాధ్యున్ని చేయవద్దన్నారు. 

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీష్ రావు తనను అణగదొక్కడానికి విశ్వప్రయత్నం చేశారని అన్నారు. అందుకోసం సంగారెడ్డి ప్రజలను బలిచేశారని...హరీష్ తప్పులను ముఖ్యమంత్రి కేసీఆర్ సరిదిద్దాలని జగ్గారెడ్డి కోరారు. 

సంబంధిత వార్తలు

నా నెంబర్ బ్లాక్, నేను చేయగలనా: కేటీఆర్, ఉత్తమ్‌ మధ్య ఆసక్తికరం

కారణమిదే: సీఎల్పీ నేత భట్టితో కేటీఆర్ భేటీ (వీడియో)