హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  మధ్య శనివారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది. ఈ సంభాషణతో  ఇద్దరు నేతలతో పాటు ఉన్నవారంతా పగలబడి నవ్వారు.

నా నెంబర్‌ను బ్లాక్ చేశారంటూ టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారుశనివారం నాడు సీఎల్పీ  రూమ్‌లో డీప్యూటీ స్పీకర్  ఎన్నిక విషయమై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో  కేటీఆర్ భేటీ అయ్యారు.

 ఈ విషయమై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కూడ చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొంటామని  మల్లు భట్టివిక్రమార్య స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై చర్చించేందుకుగాను ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వచ్చే వరకు కేటీఆర్ అక్కడే ఉన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్, ఉత్తమ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.  నా నెంబర్‌ను కేటీఆర్ బ్లాక్ చేశారని  ఉత్తమ్  వ్యాఖ్యానించారు. అయితే మీ నెంబర్‌ను  తాను బ్లాక్ చేయగలనా... అంటూ కేటీఆర్ కౌంటరిచ్చారు. తాను ఫోన్లు ఎక్కువగా మాట్లాడనని.... కేవలం మేసేజ్‌లే  చేస్తానని కేటీఆర్ ఈ సందర్భంగా  ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వివరించారు. 


సంబంధిత వార్తలు

కారణమిదే: సీఎల్పీ నేత భట్టితో కేటీఆర్ భేటీ (వీడియో)