ఇక కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారు.. : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌తో తెలంగాణ సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నుంచి ‘‘టీ’’ని తొలగించి తెలంగాణను అవమానించారని విమర్శించారు.

బీఆర్ఎస్‌తో తెలంగాణ సెంటిమెంట్‌ను సీఎం కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నుంచి ‘‘టీ’’ని తొలగించి తెలంగాణను అవమానించారని విమర్శించారు. బీఆర్ఎస్‌తో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారనీ.. అందుకే చంద్రబాబు తెలంగాణకు వచ్చారని అన్నారు. సైలెంట్‌గా ఉన్న చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైన పెట్టుకోవచ్చు అన్నారు. అయితే పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని చెప్పుకొచ్చారు. రాజకీయంగా బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారని అన్నారు.
కేసీఆర్ నిర్ణయం చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి ఇచ్చిన అవకాశం అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ పంచాయితీ పోయిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ వచ్చిందని.. అయితే విభజనలో ఉన్న డిమాండ్ల గురించి జనాలు అడగటం లేదని, నాయకులు పట్టించుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌తో ఆదరణ పొందలేరని.. అయితే తెలంగాణలో అట్రాక్ట్ చేయగలరని అన్నారు. చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని అన్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీల పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని.. ఇక నుంచి చాలా సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని చెప్పారు.