జగదీష్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి : ఎవరు ఎంత తిన్నారో.. అంత కక్కిస్తాం వదిలేస్తామా?
యాదాద్రి పవర్ ప్లాంట్ లో రూ. 20వేల కోట్ల స్కాం జరిగింది. అందులో జగదీశ్వర్ రెడ్డి పదివేల కోట్లు తిన్నాడు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉందని, టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారని కోమటిరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం విద్యుత్ రంగంపై శ్వేతపత్నాన్ని విడుదల చేసింది అధికార కాంగ్రెస్. దీనిమీద ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జగదీష్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిందనేది అబద్దం.. తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చింది. విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ లో రూ. 20వేల కోట్ల స్కాం జరిగింది. అందులో జగదీశ్వర్ రెడ్డి పదివేల కోట్లు తిన్నాడు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉందని, టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారని కోమటిరెడ్డి అన్నారు. దీనిపై విచారణ చేయాలని సీఎం ను కోరుతున్నామన్నారు కోమటిరెడ్డి. దీనిపై జగదీష్ రెడ్డి తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమే అని జగదీశ్ రెడ్డి అన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమే జగదీశ్వర్ రెడ్డి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలని కోరారు.
రేవంత్ రెడ్డితో ఉత్తమ్, సీఎస్ భేటీ.. అసెంబ్లీ సమావేశాల పొడగింపు?
కరెంట్ ఒక్క గంటా తాము ఆపలేదని, ఎప్పుడూ పవర్ హాలిడే లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గట్టిగా మాట్లాడారు. దీంతో మళ్లీ కోమటిరెడ్డి అందుకున్నారు. దొంగలు, అవినీతి అనే వరకు భుజాలు తడుముకుంటున్నారని, బీఆర్ఎస్ నేతలకు ట్రాన్స్ కో, జెన్ కో ఎండీ ప్రభాకర్ రావు దోచి పెట్టారని కోమటిరెడ్డి అన్నారు. ఎవరు, ఎంత తిన్నారో అంత కక్కిస్తాం.. వదిలేస్తామా? అంటూ కోమటిరెడ్డి జగదీశ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
ఆ తరువాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జగదీశ్వర్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గొంతు పెంచి మాట్లాడితే అబద్దాలు నిజం కావు అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆనాటి ప్రభుత్వం ఏనాడు సభ ముందు వాస్తవాలు పెట్టలేదతీ, కోమటిరెడ్డి విద్యుత్ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రి గారు జ్యూడిషల్ ఎంక్వయిరీ కోరుకున్నారు. దానిని తప్పకుండా చేస్తాం అన్నారు. మూడు అంశాలపై ఎంక్వైరీ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించారు. తెలంగాణలో కాలిపోతున్న మోటర్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్య చేసుకున్న రైతులు అంటూ.. పెద్ద సెంటిమెంటును గత ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నదో బయటకు రావాల్సిన ఉందన్నారు. చత్తీస్గడ్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లపై ప్రశ్నిస్తే మమ్మల్ని ఆనాడు మార్చల్స్ తో అసెంబ్లీ నుంచి గెంటేశారని చెప్పుకొచ్చారు.