అందరికీ ఒక గుడ్ న్యూస్ అవుతుంది.. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో పై హరీశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ నాయ‌క‌త్వం త‌మ అగ్ర‌నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతోంది. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చే నెల‌లో తెలంగాణ ప‌ర్య‌టించ‌డంపై బీఆర్ఎస్ నాయ‌కులు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణకు ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేని ప్రధాని న‌రేంద్ర మోడీ ఏ ఉద్దేశ్యంతో రాష్ట్రానికి వస్తున్నారు? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
 

It will be a good news for everyone in Telangana, minister Harish Rao's interesting comments on BRS Manifesto RMA

BRS Manifesto-Harish Rao: త్వరలోనే భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని ప్రకటించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు శుభవార్త అవుతుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ నాయ‌క‌త్వం త‌మ అగ్ర‌నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతోంది. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చే నెల‌లో తెలంగాణ ప‌ర్య‌టించ‌డంపై బీఆర్ఎస్ నాయ‌కులు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణకు పాఠశాల కూడా ఇవ్వలేని ప్రధాని న‌రేంద్ర మోడీ ఏ ఉద్దేశ్యంతో రాష్ట్రానికి వస్తున్నారు? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

తూఫ్రాన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుద‌ల గురించి ప్ర‌స్తావించారు. సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పారు. ఈ మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు గొప్ప‌ శుభవార్త అవుతుంద‌ని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపణలను తిప్పికొట్టిన హరీష్ రావు 2014లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్ లో పెనుమార్పులు వచ్చాయని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ది జ‌రిగింద‌ని చెప్పారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందనీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, ఆ తర్వాత తెలంగాణలో ఎంత తేడా ఉందో అందరూ చూడాలని మంత్రి హ‌రీశ్ అన్నారు. అనంతరం తాండూరులో రూ.50 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ, ప్ర‌ధాని మోడీల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్ వాడీ, ఆశావర్కర్లకు తెలంగాణలో వచ్చే రూ.12 వేల జీతాల్లో సగం ఎందుకు ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను ప్రశ్నించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

ప్ర‌ధాని తెలంగాణ ప‌ర్య‌ట‌న‌ను ప్రస్తావిస్తూ.. తెలంగాణకు కేంద్రం ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా మంజూరు చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రానికి కనీసం పాఠశాల కూడా ఇవ్వలేని ప్రధాని మోడీ తెలంగాణకు ఏ ప్రయోజనం కోసం వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నాయ‌కులు దీనిపై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios