23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి వంద డిజైన్లు: కేటీఆర్
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించి వంద డిజైన్లలో బతుకమ్మ చీరలను తయారు చేయించిందన్నారు.

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బతుకమ్మ చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని.. ప్రసంగించారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించి వంద డిజైన్లలో బతుకమ్మ చీరలను తయారు చేయించిందన్నారు.
ఈ నెల 23న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభిస్తారని కేటీఆర్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలందరూ ఇందుకు అర్హులని.. మొత్తం 1.02 కోట్ల మంది అర్హులైన మహిళలను గుర్తించామన్నారు.
బతుకమ్మ చీరల ద్వారా మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.16 నుంచి 20 వేల రూపాయల వరకు లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.