Asianet News TeluguAsianet News Telugu

ఐటీ గ్రిడ్ కేసులో ట్విస్ట్: తన పేరు తొలగించాలని హైకోర్టులో అశోక్ పిటీషన్

ఐటీ గ్రీడ్ కేసులో తన పేరును అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. తన పేరు తొలగించాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కు సంబంధించి కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని తన పేరు తొలగించాలని కోరారు. 

it grid ceo ashok file a petition on highcourt  against data theft case
Author
Hyderabad, First Published Mar 8, 2019, 8:27 PM IST

హైదరాబాద్: తెలుగురాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతున్న డేటా చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. డేటా చోరీ కేసులో కీలకమైన ఐటీ గ్రిడ్ సంస్థ సిఈవో అశోక్ అందుబాటులో లేకుండా పోయారు. అయితే తాజాగా అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

ఐటీ గ్రీడ్ కేసులో తన పేరును అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. తన పేరు తొలగించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కు సంబంధించి కేసులో తన పేరును పోలీసులు అనవసరంగా ఇరికించారని తన పేరు తొలగించాలని కోరారు. 

అశోక్ పిటీషన్ పై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఐటీ గ్రిడ్ సంస్థలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సోదాలు నిర్వహించింది. హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లతోపాటు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది సిట్ బృందం. అనంతరం ఆ కార్యాలయాన్ని సీజ్ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios