ఐటి ఆటోమెషన్ దెబ్బ హైదరాబాద్/బెంగలూరు మీదే

IT automation to hit hyderabad and Banglore hard
Highlights

  • ఆటో మెషిన్ తో ఇండియాలో లక్షల కొలువులు హుష్ కాకి
  • హైదరాబాద్, బెంగుళూరు టెక్కీలకూ పొంచి ఉన్న ముప్పు
  • ఆటో మెషిన్ మార్పు కోసం టాప్ టెక్ కంపెనీలు సన్నాహాలు
  • ఆందోళనలో ఐటి ఉద్యోగులు

ఐటి ఉద్యోగులకు పొంచి ఉన్న మరో ముప్పు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమెషన్ మాయాజాలంలో ఐటి ఉద్యోగులు నేడు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. టాప్ మోస్ట్ ఐటి కంపెనీలన్నీ ఆటో మెషన్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇది ఐటి ఉద్యోగులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక మనకేం ఢోకా లేదనుకున్న ఇండియన్ ఐటి ఉద్యోగులకు సైతం ఆటోమెషన్ దెబ్బ గట్టిగానే తాకనుంది. అందుకు ప్ర‌ధాన ఉదాహర‌ణ టేస్లా కంపేనీ ని తీసుకోవచ్చు.

ప్ర‌పంచంలోనే అత్య‌ధునిక‌ మోటార్ వాహానాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన టేస్లా కంపేనీ త‌న ఉద్యోగుల‌ను స‌గానికిపైగా త‌గ్గించుకోబోతున్నాం అని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. టేస్లా కంపేనీ సీఈఓ ఎలోన్ మస్క్ రెండు రోజుల క్రితం త‌మ ఉద్యోగుల‌ను ఉద్దేశించి మాట్లాడారు, కృత్రిమ మేధస్సు తో ఉద్యోగుల మ‌నుగ‌డ చాలా రిస్క్‌లో ప‌డింద‌ని హెచ్చ‌రించారు, రానున్న రోజుల్లో ప్ర‌పంచ వ్యాపంగా ఐటి కంపేనీలు ఆటోమేష‌న్  పైనే ఆధార‌ప‌డ‌నున్నాయని ఆయ‌న తెలిపారు, కృత్రిమ మేధస్సు ప్ర‌పంచ వ్యాప్తంగా జేట్ వేగంతో విస్త‌రిస్తుంద‌ని గుర్తుచేశారు, రానున్న రెండు సంవ‌త్స‌రాల‌లో తమ కంపేనీలో 25 శాతం ఉద్యోగ‌స్తుల‌ను కృత్రిమ మేధస్సు కారణంగా బయ‌టికి వెళ్లాల్సి రావొచ్చన్నారు.  మ‌రో 5 సంవ‌త్స‌రాల‌లో మ‌రింత మందిని ఇలా బ‌య‌టికి పంపిచాల్సి వస్తదని ఆందోళన వ్యక్తం చేశారు.  

 

  • ఇది ఆరంభం మాత్ర‌మే

టేస్లా సీఈఓ ఎలోన్ మస్క్ త‌న కంపేనీలో జ‌రుగుతున్న విష‌యం భ‌హిరంగంగా చెప్ప‌డం నేడు కాస్తా కంగారు పెట్టే విష‌య‌మే అయినా అది జ‌రిగి తీరుతుంది, కావున మాన‌వాళీకి ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా భ‌విష‌త్తులో మాత్రం చాలా పెద్ద ముప్పే ఉంటుంద‌నేది అక్ష‌ర స‌త్యం, ఈ కృత్రిమ మేధస్సు తో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు ప్ర‌శ్నార్థ‌కం కానున్నాయి. ముఖ్యంగా ఇండియాలో అత్య‌ధికింగా ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది, ఎందుకంటే ప్ర‌పంచంలో ఇండియా నుండి ప్రపంచానికి అత్య‌ధిక ఐటి ఉత్ప‌త్తులు 64శాతం విస్త‌రించి ఉన్నాయి, ఇప్పుడు టాప్ టెన్ టెక్ కంపేనీల‌లో 4 కంపేనీలు ఇండియా నుండి ఉన్నాయి, మిగ‌తా 6 కంపేనీల‌లో మ‌న దేశం నుండి టాఫ్ ఫోజీష‌న్‌లో ఉన్నారు, అందుకే ఇండియా మీద కృత్రిమ మేధస్సు ప్ర‌భావం అత్య‌ధికంగా ప‌డ‌నుంది. 

 

  • బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్ లోనే అధికం

టెక్ కంపేనీల‌కు నిల‌యం అయిన బెంగ‌ళూర్, హైద‌రాబాద్‌లో అత్య‌ధికంగా ఉద్యోగాల కోత ప‌డ‌నుంది, కేవ‌లం బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్ తెలుగు రాష్ట్రాల‌లో రానున్న 5 సంవ‌త్స‌రాల‌లో ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు కోల్పోతార‌న్న చేదువార్త వినిపిస్తోంది. బెంగ‌ళూర్ మ‌రియు హైద‌రాబాద్ ఐటీ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇప్ప‌టికే ట్రంప్ ఇచ్చిన షాక్ నుండి కోలుకుంటున్న ఇండియాకు అటోమేష‌న్ ప‌ద్ద‌తి మ‌రింత కంగారు పెడుతున్నది. మ‌న దేశం నుండి వార్షిక ఆధాయం 11 కోట్ల నుండి 33 కోట్ల మ‌ధ్య సంపాధిస్తున్న వారు 4 ల‌క్ష‌ల పైచిలుకే, మొద‌ట వీరీ పైనే ఈ ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇందులో స‌గానికిపైగా టెక్ కంపేనీలు అత్య‌ధిక జీతాలు ఉన్న వారిని తొలిదశలోనే తొలగిస్తారు. అప్పుడు 2 ల‌క్ష‌ల మంది జీవితాలు ప్ర‌శ్నార్థ‌కం అవుతాయి.

 

ఇండియా తర్వాాత ఆటోమెషన్ దెబ్బ చైనా మీద పడనుంది. అక్క‌డ భారీ ప‌రిశ్ర‌మ‌ల‌లో కూడా కృత్రిమ మేధస్సును జోడిస్తున్నారు అప్పుడు చైనా మ‌రింత మందిని నిరుద్యోగుల‌గా మారిపోతారు. ఇక మూడ‌వ స్థానంలో ప్ర‌పంచ పెద్ద‌న అమెరికాకు పోటు ప‌డుతుంది, ఇప్ప‌టికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లంటు ఉబెర్‌, టెస్లా, గూగుల్ ఇత‌ర ప‌లు కంపేనీలు మ‌నుషులు లేకుండా కృత్రిమ మేధస్సు మీద టెస్టుల‌ను నిర్వహిస్తుప‌న్నాయి. అంటే మ‌రో 5 సంవ‌త్ప‌రాల‌లో 30శాతం పైగా ఉద్యోగాలు పోతాయి అనేది ప్రాథ‌మిక అంచ‌నా. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖ టెక్ కంపేనీల పెద్ద‌లు కృత్రిమ మేధస్సు ను త‌మ కంపేనీలో ఎన్నీ విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు అనే విష‌యంపైన చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు, ముందుగానే చాలా మంది ప్ర‌ముఖులు ఆటోమేష‌న్ ఎలాగు ఆప‌లేము కానీ ప్ర‌త్యామ్నాయ ప‌ద్ద‌తుల‌ను శోధించాల‌ని చెబుతున్నారు.

loader