Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిల మాటకు అర్థమేమిటి?.. ప్రధాని మోదీ ఆమెకు నిజంగానే ఫోన్ చేశారా..!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారనే వార్త మంగళవారం ఉదయం నుంచి తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.

IS PM Narendra Modi call to YSRTP Chief YS Sharmila
Author
First Published Dec 7, 2022, 11:56 AM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారనే వార్త మంగళవారం ఉదయం నుంచి తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. నర్సంపేటలో పోలీసులు అడ్డుకోవడం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర చర్చకు జారీచేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో షర్మిల కారులో ఉండగానే టోయింగ్ వాహనంతో కారును పోలీసు స్టేషన్‌‌కు తరలించడం, ఆమెను అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించి షర్మిల.. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీజీపీ మహేందర్ రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి.. ఇటీవల చోటుచేసుకనున్న ఆరా తీసినట్టుగా  వార్తలు వచ్చాయి. అయితే పీఎం కార్యాలయం నుంచి షర్మిలకు ఫోన్ వచ్చిందనే విషయాన్ని.. ఆమె గానీ, వైఎస్సార్‌టీపీ గానీ ధ్రువీకరించలేదు. అలాగే ఈ వార్తలను తిరస్కరించలేదు. అయితే రాజ్యాంగ నిర్మాత  బీఆర్ అంబేడ్కర్ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల విలేకరులతో మాట్లాడుతూ.. తన కారును పోలీసులు లాక్కెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు తనకు మద్దతు తెలిపారని అన్నారు. అయితే ప్రధాని మోదీ ఫోన్ చేశారా? లేదా? అనే దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. 

అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు.. షర్మిల అరెస్ట్‌ను ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ నుంచి షర్మిలకు ఫోన్ వచ్చిందనే వార్త‌ను పలువురు నమ్ముతున్నారు. బీజేపీ, వైఎస్సార్‌టీపీ ఒకటేనని సోషల్ మీడియాలో పలువురు ప్రచారం మొదలుపెట్టాయి. అయితే తనను బీజేపీ బాణం అని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను వైఎస్ షర్మిల ఇదివరకే ఖండించిన సంగతి తెలిసిందే. 

Also Read: తెలంగాణను కేసీఆర్ పార్టీలోంచి తొలగించాడు... నేను చేర్చుకున్నా: వైఎస్ షర్మిల

అయితే షర్మిలకు మోదీ నుంచి ఫోన్ వచ్చిందనే విషయంపై బీజేపీ నేతలు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ధ్రువీకరించాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే షర్మిలకు మోదీ ఫోన్ చేశారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఇక, ప్రస్తుతం ఉన్న నిదికల ప్రకారం.. షర్మిలకు ఫోన్ చేసిన మోదీ దాదాపు 10 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. నర్సంపేటలో పాదయాత్ర అడ్డుకోవడం, హైదరాబాద్‌లో కారును టోయింగ్‌ వాహనంతో లాక్కెళ్లడం, అరెస్ట్ ఘటనలపై ఆరా తీశారు. అలాగే ఆమెను ఢిల్లీ రావాల్సిందిగా కూడా మోదీ ఆహ్వానించారు. 

ఇదిలా ఉంటే.. బెంగళూరు వెళ్లిన షర్మిల బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటారని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. నర్సంపేట నియోజకవర్గంలో నిలిచిపోయిన తన పాదయాత్రను షర్మిల ఈ నెల 8 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పార్టీ నేతలు వివరణ ఇచ్చారని.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios