Asianet News TeluguAsianet News Telugu

మణికంఠ మస్త్ డేంజర్ గాడా?

  • తల్లిని, చెల్లిని కూడా కారణం లేకుండా కొట్టేవాడట
  • వి6 టివి చానెల్ నే మూసేస్తా అంటూ డైలాగులు
  • మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసుల అనుమానం
  • డాక్టర్లు సూచిస్తే మెంటల్ హాస్పటల్ కు పంపుతామన్న పోలీసులు
Is Bittiri Satti attacker a criminal or mentally unstable

తెలుగు ప్రజల్లో తీన్మార్ సత్తిగా, బిత్తిరి సత్తిగా పాపులర్ అయిన రవిపై దాడి జరగడం పట్ల జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టు నేతలు. అయితే బిత్తిరి సత్తి మీద దాడి జరిపిన వ్యక్తి ఎవరు? అతడు ఎందుకు దాడి చేశాడు? అతని కుటుంబ పరిస్థితులేంటి? ఈ అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. బిత్తిరి సత్తి మీద దాడి చేసిన మణికంఠ తాలూకు వివరాలు ఒకసారి చూద్దాం.

మణికంఠ తాగిన మైకంలోనే బిత్తిరి సత్తి మీద దాడి చేసినట్లు పోలీసులు నిర్దారించారు. బిత్తిరి సత్తి మీద దాడి చేసిన వ్యక్తిని వి6 చానెల్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో రిమాండ్ కు తరలించారు. అయితే పోలీసులు దాడికి పాల్పడిన మణికంఠ గురించి చాలా విషయాలను వెల్లడించారు. బంజారాహిల్స్ సిఐ శ్రీనివాస్ చెప్పిన వివరాలిలా ఉన్నయి.

సత్తి మీద దాడి చేసిన మణికంఠ మానసిక స్థితి సరిగా లేదని తమకు అనుమానం ఉందన్నారు. మణికంఠ కుటుంబసభ్యులను కూడా విచారించామన్నారు. మణికంఠ తన సొంత తల్లిని, చెల్లిని కూడా ఇష్టమొచ్చినట్లు కొట్టేవాడని తమ నోటీసుకు వచ్చిందన్నారు. కారణం లేకుండానే వాళ్లిద్దరి మీద తీవ్రంగా కొట్టేవాడని సిఐ చెప్పారు.  మణికంఠకు వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్ల సూచన మేరకు అవసరమైతే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించే చాన్స్ ఉందన్నారు.

జర్నలిజంలో డిప్లొమా చేసిన తర్వాత రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ తీసినట్లు తమ నోటీసుకు వచ్చిందన్నారు. జులాయిగా తిరుగుతూ ఎవరితోపడితే వారితో గొడవలు పెట్టుకునే రకమని తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మణికంఠపై  341, 322 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనపై దాడి జరిగినట్లు బిత్తిరి సత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నడుపుతున్నారు పోలీసులు.

దాడి అనంతరం పోలీసుల విచారణలో సైతం మణికంఠ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్లు పోలీసులు చెప్పారు. బిత్తిరి సత్తిని కొట్టి వి6 ను మూసిపడేస్తానని హెచ్చరికలు జారీ చేసిన వీడియో కూడా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో అతడి మానసిక స్థితి ఏమాత్రం బాగాలేదన్న నిర్దారణకు వచ్చారు పోలీసులు.

Follow Us:
Download App:
  • android
  • ios