Asianet News TeluguAsianet News Telugu

టిఎస్పిఎస్సీ గురుకుల పరీక్షలో అక్రమాలు ? (వీడియోలు)

  • టిఎస్పిఎస్సీ గురుకుల పరీక్షలో అక్రమాలు
  • మెగా కాలేజీ యాజమాన్యంపై అభ్యర్థులు ఆగ్రహం
  • కాలేజీ ముందు ధర్నా
Irregularities in gurukul teacher exams

టిఎస్పిఎస్సీ నిర్వహించిన గురుకుల టీచర్ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  హైదరాబాద్ లోని రామాంతపూర్ లో ఉన్న మెగా డిగ్రీ కాలేజీలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. ఆదివారం గురుకుల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మెగా డిగ్రీ కాలేజీ సెంటర్ లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేశారు. అభ్యర్థులు కాని వారు కొందరు పరీక్ష కేంద్రంలోకి చొరబడ్డారని వారు ఆరోపిస్తున్నారు. 

అయితే వారి వివరాలు వెల్లడించేందుకు కళాశాల యాజమాన్యం అంగీకరించంలేదని ఆరోపించారు. ఎన్నో ఆశలతో వివిధ  జిల్లాల నుండి వచ్చి పరీక్ష రాస్తున్న విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు చేసే అక్రమాల వల్ల నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగ్సామ్ స్టార్ట్ అయినాకూడా తెలియని వ్యక్తులను కాలేజీ లోపలికి  పంపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. కాలేజి యాజమాన్యాన్ని అడిగినా సరైన రీతిలో స్పందించడం  లేదని ఆరోపించారు. 

ఇదిలా ఉండగా మెగా కళాశాలలో జరిగిన గురుకుల టీచర్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు మెగా కాలేజ్ పై ఉప్పల్ పిఎస్ లో విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అసలే టిఎస్పిఎస్సీ అలసత్వం, అయోమయం కారణంగా నష్టపోతున్న తరుణంలో ఇలా కళాశాల యాజామాన్యాలు అక్రమాలకు పాల్పడడం బాధ కలిగిస్తోందని అభ్యర్థులు ఊసూరుమంటున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios