టిఎస్పిఎస్సీ లైబ్రేరియన్ పరీక్షల్లోనూ అక్రమాలేనా ? (వీడియో)

irregularities in gurukul librarian  exams
Highlights

  • గురుకుల లైబ్రరీ పరీక్షలోనూ అక్రమాలే
  • అభ్యర్థుల ఆరోపణ
  • జాన్సన్ కళాశాలలో హాల్ కు రాకముందే సీల్ ఓపెన్ చేశారట

 

టిఎస్పిఎస్సీ జరుపుతున్న పరీక్షల్లో రోజుకో సెంటర్ లో గందరగోళం నెలకొంటున్నది. ఆదివారం రామాంతపూర్ లోని మెగా డిగ్రీ కాలేజీలో జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించగా తాజాగా సోమవారం మరో కాలేజీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ లైబ్రేరియన్ పోస్టుల కోసం పరీక్ష జరిగింది. అయితే ఆబిడ్స్ లోని జాన్సన్ డిగ్రీ కాలేజీలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్ష కేంద్రంలోని పరీక్ష హాల్ లోకి సీల్ తో కూడిన పేపర్లు రావాల్సి ఉంటే బయటే ఆ పేపర్స్ సీల్ తీసేసి తీసుకొచ్చారని అభ్యర్థులు అంటున్నారు. పరీక్ష హాల్ లోకి వచ్చే ఇన్విజిలెటర్స్ చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 15వేల మంది దరఖాస్తు చేసుకోగా 14 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు. ఇలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

loader