వ్యాక్సిన్ అవకతవకలపై నిమ్స్‌లో అంతర్గత విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో మెడికల్ సూపరింటెండెంట్ ఎన్‌వీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణారెడ్డి. వ్యాక్సిన్ వేసేముందు ఐడీ కార్డ్, ఆధార్ పరిశీలించకుండా నిలదీశారు ఎన్‌వీ సత్యనారాయణ

వ్యాక్సిన్ అవకతవకలపై నిమ్స్‌లో అంతర్గత విచారణ ముగిసింది. డైరెక్టర్ ఆదేశాలతో మెడికల్ సూపరింటెండెంట్ ఎన్‌వీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ వివరణ ఇచ్చారు కృష్ణారెడ్డి. వ్యాక్సిన్ వేసేముందు ఐడీ కార్డ్, ఆధార్ పరిశీలించకుండా నిలదీశారు ఎన్‌వీ సత్యనారాయణ. మార్చి- ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో ఎందుకు రిజిస్ట్రర్ చేయలేదని ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:నిమ్స్ వ్యాక్సినేషన్‌లో అవకతవకలు: అర్హత లేని 7 వేలమందికి టీకాలు

మరో మూడు రోజుల్లో విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు. నివేదిక తర్వాత సంబంధిత అధికారులపై వేటు పడే అవకాశం వుంది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. 7 వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.