సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇంటర్నెట్ కట్..

First Published 30, May 2018, 10:39 AM IST
internet problems at software companies in hyderabad
Highlights

ఇంటర్నెట్ కట్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్ నగరంలోని పలు సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ స్థంభాలకు ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు కట్ చేయడంతో ఈ సమస్య తలెత్తింది. గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌ ఐటీ కారిడార్‌కు అనుకొని ఉన్న జయభేరి ఎన్‌క్లేవ్‌లోని ఖాళీ స్థలంలో  పెట్‌ పార్కును నిర్మిస్తున్నారు. పెట్‌ పార్కు ముందు కరెంట్‌ స్తంభాలకు ఇంటర్‌ నెట్‌ వైర్లు ఉన్నాయి.

మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌ హరిచందన, శేరిలింగంపల్లి సర్కిల్‌ –20 ఉప కమిషనర్‌ వి.మమత పెట్‌ పార్కును సందర్శించారు. అదే సమయంలో వెస్ట్‌ జోనల్‌ ఎలక్ట్రికల్‌ విభాగం సిబ్బంది క్రేన్‌ సహాయంతో  స్తంభాలకు ఉన్న ఇంటర్‌ నెట్‌ కెబుల్‌ వైర్లను  తొలగించారు.ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండా ఇంటర్‌ నెట్‌ కేబుల్స్‌ తొలగించారని ఐటీ కంపెనీ ప్రతినిధులు వాపోయారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా దీనిపై వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన స్పందించారు. కొద్ది రోజుల్లోనే పెట్‌ పార్కు ప్రారంభం కానుందని, ఈ క్రమంలో పార్కును అనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా స్తంభాలకు ఉన్న కెబుళ్లను ముందుగా తొలగించామని తెలిపారు. స్తంభాలకు కెబుల్‌ పెట్టిన వారు ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. అనుమతి తీసుకుంటే మళ్లీ కెబుళ్లను  పునరుద్ధరించేందుకు అవకాశమిస్తామని తెలిపారు.

loader