దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్, మహేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. 

తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్, మహేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంద్రవెల్లిలో సభ ప్రకటిస్తే ఇబ్బంది ఏంటని రేవంత్ ప్రశ్నించారు. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రకటిస్తారంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇంద్రవెల్లికి నీకు ఏం సంబంధం అని రేవంత్ ప్రశ్నించారు. నిర్మల్‌కే పరిమితం అవ్వండి అంటూ రేవంత్ సూచించారు. ఇదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో సీనియర్ కలగజేసుకుని సర్దిచెప్పారు. 

హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు కోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ALso Read:ప్రగతిభవన్‌, సచివాలయం ఏం అమ్మైనా సరే.. దళితబంధు ఇవ్వాల్సిందే: కేసీఆర్‌కు రేవంత్ అల్టీమేటం

దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని రేవంత్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.