తెలంగాణ ఇంటర్ విద్యార్థులకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు హాజరు కాలేకపోయిన విద్యార్థులను, మాల్ ప్రాక్టీస్ తో పరీక్షలకు దూరమైన విద్యార్థులకు గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ అవకాశం ఈ ఒక్కసారి మాత్రమే కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కరోనా నేపథ్యంలో మళ్లీ పరీక్షలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 27, 589మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వబోతున్నారు.

ఈ యేడాది మర్చిలో జరిగిన ఎగ్జామ్స్ కు హాజరుకాలేకపోయిన 27, 251 మంది విద్యార్థులు. మాల్ ప్రాక్టీస్ ద్వారా పరీక్షలనుండి బహిష్కరించబడిన 338మంది విద్యార్థులు గ్రేస్ పాస్ మార్కులు పొందబోతున్నారు. 

ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ తదుపరి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తెలంగాణ గవర్నర్ పేరిట ఈ ఆర్డర్ రిలీజ్ అయ్యింది.