హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఇంటర్ విద్యార్థినిని చైతన్య కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది.

దీంతో ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన బస్సుతో పాటు రోడ్డుపై వెళుతున్న శ్రీచైతన్య కాలేజీ బస్సులను ధ్వంసం చేశారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. విద్యార్థులను చెదరగొట్టారు.