Asianet News TeluguAsianet News Telugu

కరోనా విలయతాండవం : పదో తరగతి పరీక్షలు రద్దు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. 

inter and tenth exams cancelled in telangana KSP
Author
Hyderabad, First Published Apr 15, 2021, 7:39 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామచంద్రన్ జీవో విడుదల చేశారు.

Also Read:కరోనా జోరు.. వేధిస్తున్న బెడ్ల కొరత: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

ఎస్ఎస్ఈ బోర్డు నిర్వహించే అబ్జక్టెవ్ విధానంలో ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పరిస్ధితులు మెరుగయ్యాక పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

కాగా, రాష్ట్రంలో దాదాపు 5.35లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. వీరందరినీ కూడా పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు.  విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios