కంటి వెలుగులో మారిన భర్త: ఏజెన్సీలకు నోటీసులు జారీ

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 20, Aug 2018, 7:35 AM IST
Information Dept issues notice
Highlights

కంటి వెలుగు-రైతు బీమా పథకాలపై ఈ నెల 14న పత్రికలలో జారీ చేసిన రెండు ఏజెన్సీలకు నోటీసు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

హైదరాబాద్: కంటి వెలుగు-రైతు బీమా పథకాలపై ఈ నెల 14న పత్రికలలో జారీ చేసిన రెండు ఏజెన్సీలకు నోటీసు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

కంటి వెలుగు- రైతు బీమా పథకాల అడ్వర్టయిజ్మెంట్లో మహిళకు సంబంధించి ప్రచురించిన ఫోటో విషయమై పూర్వపరాలు తెలియజేయాలని, ఫోటో వినియోగించేందుకు సంబంధిత మహిళ లేదా వారి కుటుంబం నుండి పొందిన అనుమతి వివరాలు సోమవారం మధ్యాహ్నంలోగా సమర్పించాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు తెలిపింది. 

పూర్వపరాలు, వాస్తవాలు సంబంధిత ఏజెన్సీల నుండి అందిన అనంతరం అనుమతి లేకుండా ఫోటో వినియోగించినందుకు గాను ఆ ఏజెన్సీలపై చర్య తీసుకుంటామని సమాచార శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.

ఈ కథనం చదవండి:

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు(వీడియో)

loader