09:36 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveభారత్ పోరాటం ముగిసింది.. లార్డ్స్ లో ఇంగ్లాండ్ గెలుపు

లార్డ్స్ లో భారత్ పోరాటం ముగిసింది. జడేజా గెలుపు కోసం పోరాటం చేసినా ఇతర ప్లేయర్ల నుంచి బద్దలు లభించలేదు. చివరి వికెట్ గా సిరాజ్ అవుట్ కావడంతో భారత్ ఓడింది. ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌట్ అయింది.

Scroll to load tweet…

09:26 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveరవీంద్ర జడేజా కొత్త రికార్డు

ఇండియా vs ఇంగ్లాండ్ మూడో టెస్టులో భారత జట్టు విజయం కోసం రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడాడు. కానీ, ఇందులో సక్సెస్ కాలేకపోయాడు. అయితే, ఇంగ్లాండ్‌లో భారత్ తరఫున వరుసగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో చేరాడు. 

ఈ లిస్టులో..

5 - రిషభ్ పంత్ (2021–2025)

4 - సౌరవ్ గంగూలీ (2002)

4 - రవీంద్ర జడేజా (2025)

08:43 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveహాఫ్ సెంచరీ పూర్తి చేసిన జడేజా.. విజయానికి 30 పరుగుల దూరంలో భారత్

భారత్ జట్టు గెలుపు కోసం రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. టీమిండియాను గెలుపు దిశగా ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

భారత్ : 163/9

జడేజా 56*

సిరాజ్ 2*

Scroll to load tweet…

08:05 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveగెలుపు కోసం ఎంతకు తెగించార్రా

India vs England: లండన్‌లోని లార్డ్స్ లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఉద్రిక్తతలలో ఉత్కంఠను పెంచాయి. మ్యాచ్ కంటే వివాదాలే హైలైట్ గా నిలుస్తున్నాయి.

Read Full Story
08:04 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 LiveIND vs ENG: లార్డ్స్ టెస్టులో గిల్, గంభీర్ పెద్ద పొరపాటు.. భారత్ ను అదే దెబ్బకొట్టిందా?

IND vs ENG: లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి అంచుకు జారుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 193 పరుగుల టార్గెట్ ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు, క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read Full Story
08:03 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveజడేజా ఒంటరి పోరాటం.. 9వ వికెట్ కోల్పోయిన భారత్

భారత జట్టు గెలుపు కోసం రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేస్తున్నారు. గెలుపు చేరువగా భారత్ ను నడిపిస్తున్నాడు. అయితే, అతనికి మద్దతు ఇచ్చే ప్లేయర్లు లేకపోవడంతో భారత్ ఓటమి అంచుకు చేరుకుంది. ఈ క్రమంలోనే 9వ వికెట్ ను కోల్పోయింది. బుమ్రా 5 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

టీమిండియా: 147/9

జడేజా 42* పరుగులు

భారత్ విజయానికి 46 పరుగులు కావాలి.

05:45 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveనితీష్ కుమార్ రెడ్డి అవుట్.. 8వ వికెట్ కోల్పోయిన భారత్

భారత జట్టు 8వ వికెట్ ను కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి 13 పరుగుల వద్ద జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Scroll to load tweet…

05:00 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Live100 పరుగులు పూర్తి చేసిన భారత్

భారత్ జట్టు 100 పరుగులు పూర్తి చేసింది. విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి. భారత్ 101/7 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 

రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలు క్రీజులో ఉన్నారు. 

Scroll to load tweet…

04:57 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveసింగిల్ డిజిట్ కే అవుట్ అయిన రిషబ్ పంత్

లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ భారత ప్లేయర్లు తీవ్రంగా నిరాశపరిచారు. చిన్న టార్గెట్ ముందు కీలక సమయంలో అవుట్ అయి భారత్ ను కష్టాల్లోకి నెట్టారు. ర

రిషబ్ పంత్ (9 పరుగులు), ఆకాశ్ దీప్ (1 పరుగు), వాషింగ్టన్ సుందర్ లు ఎక్కువ సేపు క్రీజులో వుండలేకపోయారు. యశస్వి జైస్వాల్ 0, నాయర్ 14, గిల్ 6, పరుగులు మాత్రమే చేశారు. కేఎల్ రాహుల్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

ఈ మ్యాచ్ లో భారత్ గెలవడానికి ఇంకా 92 పరుగులు కావాలి. రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలు ఆటను కొనసాగిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతోంది. 

Scroll to load tweet…

04:44 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveరవీంద్ర జడేజా, నితీష్ కుమార్ ల పైనే భారత్ భారం

82 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ లు ఉన్నారు. వీరిపైనే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. 

భారత్ : 97/7 (30)

రవీంద్ర జడేజా 13*

నితీష్ కుమార్ రెడ్డి 3* 

04:41 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveమరో వికెట్ కోల్పోయిన భారత్

ఈజీ టార్గెట్ ముందు భారత్ వరుసగా వికెట్లు జారవిడుచుకుంటోంది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 82/7 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఐదవ రోజు ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

03:55 PM (IST) Jul 14

India vs England 3rd Test Day 5 Liveరసవత్తరంగా ఇండియా vs ఇంగ్లాండ్ టెస్ట్

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. భారత విజయానికి ఇంకా 121 (ప్రస్తుతం) పరుగులు అవసరం కాగా ఇంగ్లాండ్ కు ఇంకో ఐదు వికెట్లు అవసరం. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. క్రీజులో కెఎల్ రాహుల్ 37 పరుగులు, రవీంద్ర జడేజా 1 పరుగుతో ఉన్నారు.