దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పారు. బుధవారం నాడు టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగించారు. 


హైదరాబాద్:

హైదరాబాద్: దేశానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని TRS చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.బుధవారం నాడు హైద్రాబాద్ హైటెక్స్ హెచ్ ఐసీసీ లో జరిగిన TRS Plemay లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అంతకు ముందు ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్ధిక విధానాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఒక్కరికి పని దొరకాలన్నారు. ఆ దిశగా దేశం పురోగమించాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.అంతేకానీ సంకుచిత రాజకీయ లక్ష్యం కోసం పనిచేయ వద్దని కేసీఆర్ హితవు పలికారు. టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి చేయాలని కూడా కొందరు కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ రాసిన వ్యాసాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైద్రాబాద్ వేదికగా కొత్త ఎజెండా రూపొందితే అది మనకే గర్వకారణమని కేసీఆర్ చెప్పారు.

ఎవర్నో గద్దె దించడం కోసమో, గద్దె ఎక్కించడం కోసమో ప్రయత్నాలు జరగాలా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించడం కోసం కలిసి రావాలని తనను కమ్యూనిష్టులు కోరారని చెప్పారు. అయితే కమ్యూనిష్టులతో తాను కలవబోనని చెప్పినట్టుగా కేసీఆర్ ప్రకటించారు. ఇది చెత్త ఎజెండా మీ వెంట రానని చెప్పానని కేసీఆర్ తెలిపారు. గద్దెనెక్కాల్సింది భారత దేశ ప్రజలను పార్టీలను కాదన్నారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు, ప్రజల జీవితాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.మన రాష్ట్ర ఆదాయంలో నాలుగో వంతు ఆదాయం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేశారని కేసీఆర్ సెటైర్లు వేశారు. ఇప్పుడు దేశానికి రాజకీయ ఫ్రంట్ లు అవసరం లేదన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అవసరమన్నారు.దేశ అభివృద్ది కోసం యథాస్థితి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలుసునన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ దక్కలేదన్నారు. దేశంలో అవాంఛిత, అనారోగ్యకరమైన పెడ ధోరణలు ప్రబలుతున్నాయని ఆయన చెప్పారు. భారత దేశం శాంతికి ఆలవాలమైందన్నారు. ఈ దేశంలో సంకుచితమైన ధోరణులు వచ్చాయన్నారు. ఈ పెడ ధోరణులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభ్యున్నతి కోసం పని చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.అధికారాల బదలాయింపు సక్రమంగా జరగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన రాష్ట్రమైన Gujarat లో కూడా విద్యుత్ కోతలున్నాయన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ప్రకటిత, అప్రకటిత కోతలున్నాయన్నారు. Telangana రాష్ట్రం పని చేసిన స్థాయిలో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ను కూడా వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. దేశంలో పుష్కలంగా జల వనరులున్నా కూడా నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దేశంలో 65 వేల టీఎంసీల నీరు ఉండి కూడా కనీసం తాగు నీరు కూడా నోచుకోలేని పరిస్థితులున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పనిచేసినట్టుగా కేంద్రం పనిచేస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 24 గంటల విద్యుత్ ఉండేదన్నారు.

దేశంలో ఎక్కువగా యువ శక్తి ఉన్న దేశం భారత్ అని ఆయన చెప్పారు. ఎలాంటి సహజ వనరులు కూడా లేని సింగపూర్ ఆర్ధిక వ్యవస్థలో టాప్ లో ఉందన్నారు. ఇండియాలో అన్నీ ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నామన్నారు. సింగపూర్ ప్రజలు మెదడుతో పని చేయడంతో ఆ దేశం ప్రగతిలో ముందుకు వెళ్తుందన్నారు. కానీ మన వద్ద ఎన్ని ఉన్నా కూడా ప్రగతిలో వెనుకబడి ఉన్నామన్నారు.