తెలంగాణలో వచ్చే ఐదు రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 14, 15 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం వుందని తెలిపారు. 

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే పడిపోయే అవకాశం వుందని.. కొమురంభీం, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, భూపాలపల్లి, నిర్మల్, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. 14, 15 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం వుందని తెలిపారు. 

మరోవైపు.. ఈసారి ఎండల తీవ్రత అధికంగా వుంటుందని నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్లే ఈ పరిస్ధితి తలెత్తిందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన ఏషియన్ పసిఫిక్ వాతావరణ పరిశోధన సంస్థ, ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెట్రాలజీ వేర్వేరుగా విడుదల చేసిన బులెటిన్లు చెబుతున్నాయి.