హైద్రాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు: కోహినూర్ డెవలర్స్ సంస్థలో తనిఖీలు
హైద్రాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు సాగుతున్నాయి. కోహినూర్ డెవపర్స్ సంస్థలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.
హైదరాబాద్: నగరంలో మరోసారి ఐటీ సోదాలు సాగుతున్నాయి. కోహినూర్ డెవలపర్స్ అనే రియల్ ఏస్టేట్ సంస్థలో ఐటీ అధికారులు బుధవారంనాడు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ నగర శివారులో ఈ సంస్థ రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంది.
కోహినూర్ డెవలపర్స్ సంస్థ కు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని 30 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.గత ఐదేళ్లుగా ఈ సంస్థ దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ విషయమై అనుమానంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ సంస్థ కార్యాలయాలు, ఈ సంస్థ ప్రతినిధుల ఇళ్ల లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
గతంలో హైద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఏస్టేట్ సంస్థల కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రియల్ ఏస్టేట్ సంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు ఎక్కువయ్యాయి. ఈ నెల 22న హైద్రాబాద్ లోని సాహితి ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.