Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు: వాసవీ గ్రూప్ సంస్థల్లో రైడ్స్

వాసవీ గ్రూప్ సంస్థలతో పాటు సుమధుర రియల్ ఏస్టేట్  సంస్థపై ఐటీ శాఖ అధికారులు రెండో రోజూ కూడా కొనసాగుతున్నాయి. 

Income tax Raids Continued second day on Real Estate Group in Hyderabad and Banglore
Author
Hyderabad, First Published Aug 18, 2022, 1:26 PM IST

హైదరాబాద్: రెండు రియల్ ఏస్టేట్ సంస్థలపై ఐటీ శాఖాధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వాసవి గ్రూప్ నకు చెందిన సంస్థలతో పాటు ఈ సంస్థతో కలిసి నిర్మాణాలు చేపట్టిన సుమధుర సంస్థపై కూడా ఐటీ అధికారుల సోదాలు సాగుతున్నాయి.వాసవి గ్రూప్ సంస్థలతో పాటు సుమధుర సంస్థల్లో కూడా నిన్నటి నుండి ఐటీ అధికారులు  సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 30 చోట్ల సోదాలు సాగుతున్నాయి. హైద్రాబాద్, బెంగుళూరులలో పెద్ద ఎత్తున కీలక డాక్యుమెంట్లతో పాటు నల్ల ధనాన్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

aslso read:హైద్రాబాద్ వాసవి రియల్ ఏస్టేట్ గ్రూప్ పై ఐటీ సోదాలు: ఏక కాలంలో 10 చోట్ల సోదాలు

అతి పెద్ద టవర్ నిర్మాణాలు చేపట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా జాగ్రత్తలు తీసుకొని  విక్రయాలు చేశారని ఐటీ అధికారులు గుర్తించారని ఈ కథనం తెలిపింది.  ఈ సంస్థలు చేసిన లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios