ట్రై కలర్స్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రై కలర్స్ కంపెనీ.. హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది.
ట్రై కలర్స్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రై కలర్స్ కంపెనీ.. హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ట్రై కలర్స్ కంపెనీ భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రాపర్టీ బిజినెస్ చేస్తోంది. అయితే ఐటీ అధికారులు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలతో పలు పట్టణాల్లో ట్రై కలర్స్ కంపెనీకి చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు భారీగా నగదును గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్ట్ చేసింది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
