Ayyappa Mala: ప్రైవేట్ స్కూల్ ఓవర్ యాక్షన్.. అయ్యప్ప మాల వేసుకున్న చిన్నారికి నో ఎంట్రీ.. 

Ayyappa Mala:ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్‌ లోకి అనుమతి అంటూ చిన్నారిని ఎండలో నిలబెట్టింది. దీంతో ఆ చిన్నారి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

in Rangareddy Bandlagooda Private School Management Not Allowed Girl Child who Wears Ayyappa Mala KRJ

Ayyappa Mala:ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల(Ayyappa mala)వేసుకున్న విద్యార్థిని(student)ని తరగతి గదిలోకి అనుమతించలేదు. స్కూల్ యూనిఫాంలోనే రావాలని లేకపోతే పాఠశాలకు రావొద్దంటూ యాజమాన్యం హుకుం జారీ చేసింది. ఈ క్రమంలో సదరు బాలిక గంట పాటు బయట ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని  తెలుసుకున్న తండ్రి వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. తన కుమార్తెను ఎందుకు లోపలికి రానివ్వడం లేదని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.

వివరాల్లోకెళ్తే.. రాజేంద్ర నగర్ బండ్లగూడలోని ఓ ప్రయివేట్ స్కూల్లో పూర్వీ అనే చిన్నారి 4వ తరగతి చదువుతుంది. ఆ చిన్నారి సోమవారంనాడు అయ్యప్ప మాల ధరించింది. పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారి చూసిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ యూనిఫామ్‌ లేనిది అనుమతించబోమని, ఆ చిన్నారిని స్కూల్ యాజమాన్యం గంటకు పైగానే ఎండలో నిలబెట్టింది.  విషయాన్ని  తెలుసుకున్న తండ్రి వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. తన కుమార్తెను ఎందుకు ఎండలో నిలబెట్టారనీ, ఎందుకు లోపలికి రానివ్వడం లేదని పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.

 కానీ స్కూల్ డ్రెస్ ఉంటేనే అనుమతిస్తామని, అయ్యప్ప మాల ఆ డ్రెస్ లో ఉంటే అనుమతించమని స్పష్టం చేసింది. మాల వేసుకుంటే స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఎలా కుదురుతుందని, ఇలా వస్తే మీకొచ్చిన సమస్య ఏంటని తండ్రి యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ వ్యవహరాన్ని మొబైల్ లో వీడియో తీసేందుకు ప్రయత్నిస్తే యాజమాన్యం అడ్డుకుందంటూ.. ఈ రికార్డింగులు స్కూల్ లో చెల్లవంటూ స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగినట్లు ఆ చిన్నారి తండ్రి ఆరోపించారు. ఈ క్రమంలో ఆ చిన్నారి తండ్రి ఆందోళనకు దిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios