దుబ్బాక:తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాత ప్రకటించారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  సోలిపేట  సుజాత నామినేషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.

తనకు ఎలాంటి ఆదాయం లేదని ఆమె ఆ అఫిడవిట్ లో ప్రకటించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి తన భర్త సోలిపేట రామలింగారెడ్డి 1.36 లక్షల ఆదాయ పన్నును చెల్లించినట్టుగా ఆమె ప్రకటించారు.

also read:దుబ్బాక బైపోల్: గెలుపు ఓటములు నిర్ణయించేది వీరే.

బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కూడ ఎన్నికల అఫిడవిట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసులను ఆయన ప్రకటించారు. కానీ ఏ కేసులో కూడ  దోషిగా  నిర్ధారించలేదని ఆయన   ప్రకటించారు.

తనపై నగదు సరఫరా, రేప్, ఆదాయ పన్ను కేసులు, ఆర్టీసీ సమ్మె సమయంలో కేసులు నమోదైనట్టుగా ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.