దుబ్బాక బైపోల్: గెలుపు ఓటములు నిర్ణయించేది వీరే...

First Published 13, Oct 2020, 11:44 AM

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో మెజారిటీపైనే తాము దృష్టి పెట్టినట్టుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఫోకస్ పెట్టాయి.  అయితే ఈ స్థానంలో మెజారిటీపైనే దృష్టిపెట్టినట్టుగా టీఆర్ఎస్ చెబుతోంది. టీఆర్ఎస్ ను ఓడిస్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 1.90 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ ఓటర్లలో 90 వేల మంది బీసీలు, మిగిలినవారు ఓసీ,ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. దీంతో ఆయా వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి.ఈ ఉప ఎన్నికలను ఈ మూడు పార్టీలు సీరియస్ గా తీసుకొన్నాయి.

ఈ నియోజకవర్గంలో  చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. చేనేత కార్మికులతో పాటు బీడి కార్మికుల ఓట్లు కూడ గణనీయంగానే ఉంటాయి. సుమారు 20 వేలకు పైగా చేనేత కుటుంబాలు ఉన్నట్టుగా అంచనా. బీడికార్మికుల సంఖ్య 19,500 గా ఉంటుందని సమాచారం. చేనేత, బీడి కార్మికుల ఓట్లు సుమారు 40 వేలు ఉంటాయి.

ఈ రెండు వర్గాలు ఎటు మొగ్గుచూపితే ఆ వ్యక్తి లేదా పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అంతేకాదు వీరే గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు.

టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన విషయాన్ని మంత్రి హరీష్ రావు తన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలనలో తీసుకొన్ని నిర్ణయాలు ఏ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయో కూడ ఆయన వివరిస్తున్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రంలోని బీజేపీ సూచిస్తున్న విషయాన్ని హరీష్ రావు ప్రధానంగా తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలంతా దుబ్బాక నియోజకవర్గంలోనే మకాం వేశారు. మండలానికి ఓ కీలకనేతను ఇంఛార్జీగా నియమించారు. ఎన్నికల ప్రచార బాద్యతలను ఈ నేతలు పర్యవేక్షిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ నుండి మనోహార్ రావు, నర్సింహ్మారెడ్డి, నాగేశ్వర్ రెడ్డిలు పార్టీని వీడారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు. బీజేపీ నుండి బహిష్కరణకు గురైన కమలాకర్ రెడ్డితో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.  రఘునందన్ రావుకు టికెట్ ఇవ్వడాన్ని కమలాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించిన విషయం తెలిసిందే.

loader