Asianet News TeluguAsianet News Telugu

రూ.300 కోట్ల‌తో నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్ ప్యాక‌ర్టీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

Nirmal: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో పంట‌ల‌కు నీళ్ల కోసం రైతులు త‌న్నుకునే వారు కానీ, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని తెలిపారు. 

In Nirmal Rs. Minister KTR laid the foundation stone for the oil farm facility to be built at a cost of 300 crores RMA
Author
First Published Oct 4, 2023, 2:07 PM IST

Telangana Minister KTR: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) చెప్పారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో పంట‌ల‌కు నీళ్ల కోసం రైతులు త‌న్నుకునే వారు కానీ, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. నిర్మ‌ల్ జిల్లాలోని పాక్ పట్లలో  రూ.300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న  ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో పంటలకు నీళ్ళ కోసం రైతులు తన్నుకునే వారు కానీ, నేడు అలాంటి ప‌రిస్థితులు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకు నీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు ద‌క్కుతుంద‌ని త‌లిపారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ పంటలు కొనుగోలు చేసినా చేయకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఆయిల్ ఫామ్ పరిశ్రమ వృద్ధితో ప్రతి ఒక్కరికి త‌క్కువ ఖ‌ర్చుతోనే మంచి నూనె అందే అవకాశం ఉందని తెలిపారు. తన నియోజకవర్గమైన సిరిసిల్ల రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే తనదే బాధ్యత అని మంత్రి స్ప‌ష్టం చేశారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల జిల్లాలో పండించే ఆయిల్ ఫామ్ పంటను ఇక్కడే కొనుగోలు చేస్తార‌ని చెప్పారు.

ప్రతి రైతు సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ సాగు అనీ, రైతుల అయిల్ ఫామ్ సాగు ప్ర‌భుత్వం రాయితీలు సైతం ఇస్తున్న‌ద‌ని చెప్పారు. రివర్స్ పంపుతో ఎస్సా ఎస్పీ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని అన్నారు. రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తూ.. ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. రాబోయే  ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ ప్ర‌జ‌ల‌ను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios