కూతురిని వేధించడంతో అల్లుడి ఇంటిపై కత్తులు, కారంతో దాడి.. ఒకరు మృతి
నల్లగొండకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. అంతేకాదు, సోమవారం ఆమెపై భౌతిక దాడికి దిగి.. అదే విషయాన్ని తన మామ, బావమరిదిలకు ఫోన్ చేసి చెప్పడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు కుటుంబం కత్తులు, కారాలతో ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక్కరు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చేరారు.
హైదరాబాద్: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తమ కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టారు. వేరే ఊరికి ఇచ్చే కంటే కళ్ల ముందే తమ కూతురు ఉండాలనే ఉద్దేశంతో ఊరిలోని అబ్బాయికే ఇచ్చి పెళ్లి(Marriage) చేశారు. ఎకరం భూమి, పన్నెండున్నర తులాల బంగారం వరకట్నంగా సమర్పించుకున్నారు. ఆ దంపతులకు బిడ్డ పుట్టిన తర్వాత గొడవలు అధికం అయ్యాయి. అదనపు వరకట్నం(Dowry) కోసం వేధింపులు చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఒక్కసారిగా సహనం నశించిన ఆ అమ్మాయి తల్లిదండ్రుల కుటుంబం మంగళవారం కత్తులు, కారాలు చేతబూని అల్లుడి ఇంటిపై దాడికి వెళ్లారు. అల్లుడిని కత్తితో పొడిచారు. ఇతరులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వియ్యంపురాలు మృతి చెందారు. అల్లుడు సహా ఆయన ఇతర కుటుంబ సభ్యులు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, బొక్కమంతలపాడు గ్రామానికి చెందిన సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె శ్యామల. ఆమె వివాహాన్ని బయటి ఊరి వారికి కాకుండా అదే ఊరిలోని వ్యక్తితో జరిపించారు. అదే గ్రామానికి చెందిన భిక్షమయ్య, అచ్చెమ్మ దంపతుల కుమారుడు శివనారాయణతో శ్యామల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి సమయంలో కట్నం కింద ఒక ఎకరం భూమి, పన్నెండున్నర తులాల బంగారం ఇచ్చారు.
Also Read: నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు
శివనారాయణ, శ్యామల దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉన్నది. కూతురు పుట్టిన తర్వాత అదనపు కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. మరింత కట్నం తేవాలని అత్తింటి వారి కుటుంబం శ్యామలను ఒత్తిడి చేసేవారు. ఈ కారణంగా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. అల్లుడు కూడా శ్యామలపై వేధింపులు చేపడుతున్నాడు. ఈ విషయం శ్యామల తల్లిదండ్రులకు తెలిసినప్పటి నుంచి వారిలో బాధ మొదలైంది.
సుమారు పది నెలల క్రితం శ్యామల సోదరుడు శివ వివాహం ఉన్నది. కానీ, ఆ వివాహానికి శ్యామలను పంపలేదు. సోమవారం కూడా శ్యామలపై భౌతిక దాడికి దిగాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మామయ్య, బావమరిది శివకు ఫోన్ శివనారాయణ స్వయంగా చెప్పాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయమే కత్తులు, కారంతో శివనారాయణ ఇంటి మీదకు వెళ్లారు. శివనారాయణను కత్తితో పొడిచారు. శివనారాయణ తల్లి అచ్చెమ్మ ఇతరులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో అచ్చెమ్మ అక్కడికక్కడే మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డరు. అనంతరం చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. శివనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు.