ఎలుకల దాడిలో గాయపడిన రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమించి చనిపోయారు. ఎలుకల దాడి ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో జరగగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆయనను హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకొచ్చారు. అయితే ఈ హాస్పిటల్ లోనే శ్రీనివాస్ మృతి చెందారు.
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న సమయంలో ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ మృతి చెందారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా భీమారం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన చికిత్స కోసం ఆయన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే హాస్పిటల్ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో శ్రీనివాస్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. అయితే శ్రీనివాస్ కు చికిత్స నిర్వహించిన వైద్యులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించారని రోగి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కనీసం గాయాలు అయిన చోట కూడా చికత్స చేయలేదని చెప్పారు. ఈ విషయంలో మీడియాలో కథనాలు వచ్చిన తరువాతనే డాక్టర్లు స్పందించారని చెప్పారు.
ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి కారణమైన ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే గురువారం నాడు సూపరింటెండ్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఈ హాస్పిటల్ లో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నకాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. దీంతో పాటు ఆర్‌ఐసీయూ ఇంచార్జీ అయిన నాగర్జున్ రెడ్డిని కూడా విచారిస్తామని ప్రభుత్వం తెలిపింది.
రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎలుకల బాధ నివారించేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఎలుకలను పట్టుకొనేందుకు సిబ్బంది బోన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ ఏంజీఎం హాస్పిటల్ కు కొత్తగా వచ్చిన సూపరింటెండ్ శానిటేషన్ పై దృష్టి పెట్టారు.
