చేర్యాల: ఓ పోలీసు కానిస్టేబుల్ మరో మహిళతో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని చేర్యాల మండలంలో చోటు చేసుకుంది. 

సిద్ధిపేట మండలం మద్దూరు మండలంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గూడెళ్లి రమేష్ ను ఆయన భార్య మమత మరో మహిళతో ఉండగా పట్టుకుంది. 

గూడెళ్లి రమేష్, మమత 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఉద్దరు కూతుళ్లు. వారి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మర్పడగ బంగ్లా మండలం బాపూజీగూడెం.

రమేష్ కు 2011లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే గత కొంత కాలంగా రమేష్ భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. అదే సమయంలో చేర్యాలలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు.

ఆ విషయం తెలిసిన మమత అతను ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి రెడ్ హ్యాండెడ్ గదా పట్టుకుంది. ఇద్దరిపై ఆమె దాడి కూడా చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.