Asianet News TeluguAsianet News Telugu

నకిలీ మద్యం కేసు: ఎక్సైజ్ పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు కొండల్ రెడ్డి

నకిలీ మద్యం కేసులో  ప్రధాన నిందితుడు  కొండల్ రెడ్డిని  ఎక్సైజ్ పోలీసులు   ఇవాళ  అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ మద్యం తయారీ విషయమై  కొండల్ రెడ్డిని  ఎక్సైజ్ అధికారులు విచారించనున్నారు. 

illicit  liquor case:Telangana  Excise Police Detained  Kondal Reddy
Author
First Published Dec 26, 2022, 3:03 PM IST


హైదరాబాద్: నకిలీ మద్యం కేసులో  ప్రధాన నిందితుడు  కొండల్ రెడ్డిని  ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కొండల్  రెడ్డిని  నకిలీ మద్యం  కేసులో  విచారణ చేయనున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ నెల 16వ తేదీన నకిలీ మద్యం విషయమై  ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా  ఎక్సైజ్ శాఖ అధికారులు  నకిలీ మద్యం విషయమై  విచారణ నిర్వహించారు.  హయత్  నగర్  కేంద్రంగా  నకిలీ మద్యం సరఫరా జరిగినట్టుగా  గుర్తించారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో  నకిలీ మద్యం  సరఫరా  చేసినట్టుగా  ప్రచారం సాగింది.  

హైద్రాబాద్  శివారు ప్రాంతాలతో పాటు  ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని  కొన్ని ప్రాంతాల్లో   నకిలీ మద్యం సరఫరా చేసినట్టుగా  ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు.  ఉమ్మడి  రంగారెడ్డి  జిల్లాలోని  మొండి గౌరెల్లి  గ్రామంలో నకిలీ మద్యం సరఫరాతో సంబంధం  ఉన్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్  చేశారు. అతను ఇచ్చిన సమాచారం  మేరకు  ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా  సోదాలు నిర్వహించారు.  హయత్ నగర్,  ఇబ్రహీంపట్నం, దేవలమ్మనాగారం , చౌటుప్పల్  వంటి ప్రాంతాల్లో  నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు.

ఈ  కేసులో  ఇప్పటికే  25 మందికిపైగా  ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్  చేశారు.  అంతే కాదు  నకిలీ మద్యం తయారు చేస్తున్న బాట్లింగ్  యూనిట్ ను కూడా తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు..  ఈ నెల 20వ తేదీన  ఒడిశాలోని కటక్ కు సమీపంలోని అటవీ ప్రాంతంలో  నకిలీ మద్యం తయారీకి  సంబంధించిన  యూనిట్ లో  ఒడిశా ఎక్సైజ్ పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సోదాలు చేశారు.

also read:మునుగోడు ఉపఎన్నికలో నకిలీ మద్యం సరఫరా: ఒడిశాలో లిక్కర్ బాట్లింగ్ యూనిట్ గుర్తింపు

నకిలీ  మద్యం తయారీకి  సంబంధించిన  ముడి సరుకును  సీజ్ చేశారు. బాట్లింగ్  యూనిట్  ను ధ్వంసం  చేశారు. తెలంగాణ రాష్ట్రంలో  తయారు చేసినట్టుగానే  బార్ కోడ్లు, మద్యం సీసాలు  సరఫరా చేసే అట్టపెట్టెలపై  కోడ్ లను తయారు చేసినట్టుగా  ఎక్సైజ్ శాఖాధికారులు గుర్తించారు. నకిలీ  మద్యం కేసు విషయమై  ఎక్సైజ్ పోలీసుల సోదాలు చేస్తున్న విషయం తెలుసుకున్న తర్వాత  కొండల్ రెడ్డి  పరారీలో  ఉన్నాడు. ఇవాళ  కొండల్ రెడ్డిని  హయత్ నగర్  ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   నకిలీ మద్యానికి  సంబంధించి కొండల్ రెడ్డి  నుండి  మరింత సమాచారాన్ని సేకరించనున్నారు ఎక్సైజ్ పోలీసులు.


 

Follow Us:
Download App:
  • android
  • ios