TELANGANA: అక్రమ గుర్రపు పందెం బెట్టింగ్ రాకెట్ ను ఎల్‌బీనగర్ జోన్ రాచకొండ పోలీసులు ఛేదించారు. పక్కాసమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి పలువురుని అరెస్టు చేశారు.
TELANGANA: అక్రమ గుర్రపు పందెం బెట్టింగ్ రాకెట్ ను ఎల్‌బీనగర్ జోన్ రాచకొండ పోలీసులు ఛేదించారు. పక్కాసమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి పలువురుని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అధికారులు ఈ ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్న అక్రమ గుర్రపు పందాల బెట్టింగ్ రాకెట్ ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బెట్టింగ్ రాకెట్ నిందితులైన అంకం మహేంద్ర వర్మ (37), సత్తి జయ వెంకట అశోక్‌రెడ్డి (31), కూరపాటి నరేంద్రరెడ్డి (32) )లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్ నిర్వహించడానికి వీరు సోషల్ మీడియా యాప్‌లు, వాట్సాప్ ను వినియోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ. 46,000 నగదు, 09 మొబైల్ ఫోన్‌లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరి స్తంభింపచేసిన బ్యాంక్ ఖాతాలో మొత్తం రూ. 2,87,131 నగదును గుర్తించారు. మరో ఖాతాలో రూ.54,131 ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో నమోదైంది.

ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించిన వివరాల ప్రకారం.. అక్రమ గుర్రపు పందెం బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురి వివరాలు ఇలా ఉన్నాయి.. అంకం మహేంద్ర వర్మ సిద్ధిపేట జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, సత్తి జయ వెంకట అశోక్ రెడ్డి.. అమీర్ పేటలో ఉంటున్నాడు. అతని స్వస్థలం ఏపీలోని తాడేపల్లిగూడెం. మరో వ్యక్తి కూరపాటి నరేంద్ర రెడ్డి మైత్రివనంలో ఉంటున్నాడు. అంకం మహేంద్ర వర్మ హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో ఉంటూ.. గుర్రపు పందెం బెట్టింగ్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. తరువాత అతను గుర్రపు పందెం బుకీగా మారడానికి.. అక్రమంగా డబ్బు సంపాదించడానికి ఒక పథకం వేశాడు. "దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో, ప్రజలు ఇంట్లోనే ఉండిపోయారు. దేశంలో గుర్రపు పందాలు లేవు. నవంబర్ 2020లో రేసులు తిరిగి ప్రారంభమయ్యాయి, అయితే చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్ మోడ్‌లను ఉపయోగించి.. bet365 యాప్‌లోని ఫోన్‌ల ద్వారా గుర్రాలపై పందెం వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే, ఇలాంటివి చట్ట విరుద్ధం. ప్రతివాదులు సాధారణ ప్రజలను మోసం చేయడానికి వారి ప్రయోజనం కోసం ఫోన్‌ల ద్వారా మరియు ఆన్‌లైన్ మార్గాల ద్వారా వ్యక్తుల నుండి పందెం కాస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అంకం మహేంద్ర వర్మ పందెంరాయుళ్ల కోసం గుర్రపు పందెం బెట్టింగ్ గ్రూప్‌ను ప్రారంభించాడు.
ఈ బెట్టింగ్స్ లో దాదాపు 106 మంది పాల్గొంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ఇ-వాలెట్‌ల ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బును అంగీకరించేవాడు. ఇందుకోసం సత్తి జయ వెంకట అశోక్ రెడ్డిని సబ్ ఆర్గనైజర్‌గా, కూరపాటి నరేంద్రరెడ్డిని అకౌంటెంట్‌గా నియమించారు. హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాలలో బెట్365 యాప్‌ని వీక్షిస్తూ గుర్రపు పందాలను నిర్వహించే సమయంలో ఆ రేస్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను గ్రూప్‌లలో పోస్ట్ చేసేవాడు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో బెట్టింగ్ లు నిర్వహిస్తూ.. అక్రమాలకు పాల్పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ కమీషనర్ మహేశ్ ఎం భగవత్, ఐపీఎస్ జి. సుధీర్ బాబుల పర్యవేక్షణలో దాడులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
