మరో మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని గుట్టుగా కాపురం సాగిస్తున్నాడని తెలుసుకున్న ఓ భార్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: తాళికట్టిన భర్త తనకు మాత్రమే సొంతమని మహిళలు భావిస్తుంటారు. వేరే మహిళలను భర్త కన్నెత్తి చూసినా సహించరు. అలాంటి మరో మహిళ మోజులో పడి గుట్టుగా కాపురమే పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఓ వివాహిత. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన అనిల్-రామేశ్వరి దంపతులు జగద్గిరిగుట్ట (jagadgirigutta)లో నివాసముంటున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలోకి వివాహేతర సంబంధం (illegal affair) చిచ్చుపెట్టింది. అనిల్ మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాదు కుత్బుల్లాపూర్ లోని బ్యాంక్ కాలనీలో ఏకంగా వేరుకాపురమే పెట్టాడు. ఈ విషయాన్ని భార్య రామేశ్వరికి తెలియకుండా ఇంతకాలం మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. 

అయితే భర్త వ్యవహారశైలిపై అనుమానం కలిగిన రామేశ్వరి అతడి కదలికలపై నిఘా పెట్టింది. దీంతో అతడు మరో మహిళతో అక్రమసంబంధాన్ని పెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో భర్తతో పాటు అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ (red handed) గా పట్టుకోవాలని రామేశ్వరి భావించింది. 

read more భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త ఏం చేయాలో తెలుసా.. ఎలా స్పందించలో తెలుసా?

భర్త ప్రియురాలితో కలిసి వుండగా బంధువులతో కలిసి వారు కాపురముంటున్న ఇంటికి వెళ్లింది రామేశ్వరి. ఇలా ప్రియురాలితో వుండగా భర్త అనిల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ క్రమంలో రామేశ్వరితో బంధువులు అనిల్ తో పాటు అతడి ప్రియురాలిపై దాడికి యత్నించారు. దీంతో కాస్సేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఇలా ప్రియురాలితో వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తను రామేశ్వరి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని రామేశ్వరి పోలీసులను కోరుతోంది. 

read more చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో దారుణం..

ఇదిలావుంటే తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను భార్య అతి కిరాతకంగా హతమార్చిన (murder) ఘటన కృష్ణా జిల్లా (krishna district) వెలుగుచూసింది. విజయవాడ (vijayawada) లోని ఏలూరి రోడ్డులో పారిశుధ్ద్య కార్మికురాలిగా పనిచేసే సత్య అనే మహిళకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగివుంది. ఈ విషయం తెలిసి సత్యనారాయణ భార్య మల్లీశ్వరి పలుమార్లు సత్యను హెచ్చరించింది. అయినా తన భర్తను వదలకపోవడంతో కసిపెంచుకున్న మల్లీశ్వరి చివరకు సత్యను అతికిరాతకంగా హతమార్చింది. 

సత్య ఇంటికి వెళ్లి గొడవ పడిన మల్లేశ్వరి మొదట బ్లేడుతో ఆమె గొంతు భాగంలో కోసింది. తర్వాత అక్కడే ఉన్న రోకలిబండతో తలపై పలుమార్లు మోదడంతో ఘటనాస్థలంలో సత్య మృతి చెందింది. ఆ తర్వాత మల్లేశ్వరి అక్కడినుండి పరారయ్యింది. హత్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుందని కృష్ణలంక సీఐ పి.సత్యానందం వెల్లడించారు.ఆమెపై కేసు నమోదు చేసి ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో వుందని... పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ తెలిపారు.