ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ఈగలు. బొద్దింకలు చేరిన ఆహారం..తిరిగి విద్యార్థులపై నిందలు, సంచలన పోస్ట్
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హాస్టల్ ఫుడ్ పై శశ్వత్ గోయెల్ అనే అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చర్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. హాస్టల్ లో ఫుడ్ ఎంత అధ్వానంగా ఉంటోందో చెప్పడానికి ఆయన చేసిన పోస్ట్ ఉదాహరణగా మారింది.
కాలేజ్ లైఫ్ అనేది విద్యార్థులకు మరచిపోలేని అనుభూతిగా ఉంటుంది. హాస్టల్ లో ఉండటం, స్నేహితులతో కలసి క్లాసులు ఎగ్గొట్టడం, హాస్టల్ భోజనం ఇవన్నీ విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. కానీ ప్రస్తుతం హాస్టల్ ఫుడ్ తిని చదువుకోడం అనేది బాధని కలిగించే అంశంగా మారిపోతోంది అంటూ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ రీసెర్చర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హాస్టల్ ఫుడ్ పై శశ్వత్ గోయెల్ అనే అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చర్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. హాస్టల్ లో ఫుడ్ ఎంత అధ్వానంగా ఉంటోందో చెప్పడానికి ఆయన చేసిన పోస్ట్ ఉదాహరణగా మారింది. విద్యార్థులకు వడ్డించేందుకు ప్రిపేర్ చేసిన కీరా సలాడ్ మొత్తం ఈగలు, బొద్దింకలు ముసురుకుని కనిపిస్తున్నాయి.
ఆ ఫోటోని శశ్వత్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. కొన్ని ఏళ్ల నుంచి ఈ సమస్య కొనసాగుతోంది. విద్యార్థులకు ఈగలు, బొద్దింకలు ముసురుకున్న ఆహారం వడ్డిస్తున్నారు. కనీసం హ్యాండ్ వాష్ సౌకర్యం కూడా లేదు. శశ్వత్ ట్విట్టర్ లో చేసిన ఈ పోస్ట్ ని 3 లక్షల మంది పైగా వీక్షించారు.
హాస్టల్ ఫుడ్ గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన ఉండడం లేదట. హాస్టల్ నిర్వాహకులు స్పందించకపోగా తిరిగి విద్యార్థులపైనే నిందలు వేయడం ప్రారంభిస్తున్నారట. కలుషిత హాస్టల్ ఆహారంతో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు సిబ్బంది తిరిగి విద్యార్థులనే తప్పుపడుతున్నారు. స్విగ్గి, జుమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ సంస్థల నుంచి విద్యార్థులు ఫుడ్ తెచ్చుకుని తినడం వల్లే అనారోగ్యానికి గురవుతున్నారు అని బ్లేమ్ చేస్తున్నారట.
వాస్తవానికి హాస్టల్ ఫుడ్ కంటే ఆన్లైన్ ఫుడ్ సంస్థల ఫుడ్ చాలా సేఫ్ అని శశ్వత్ తెలిపారు. హాస్టల్ లో కలుషిత నీటి కారణంగా గత ఏడాది 40 మంది పైగా విద్యార్థులు టైఫాయిడ్ జ్వరం బారీన పడ్డట్లు తెలిపారు. కానీ ఈ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తూ హాస్టల్ వార్డెన్ దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం శశ్వత్ చేసిన ట్వీట్ ఇండియా మొత్తం వైరల్ అవుతోంది. ఇంతవరకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ హాస్టల్ అథారిటీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.