Asianet News TeluguAsianet News Telugu

టీఎస్ఎంసీ ఆన్ లైన్ డేటాబేస్ లో న‌కిలీ డాక్ట‌ర్ల గుర్తింపు.. కేసు న‌మోదు చేసిన సైబ‌ర్ క్రైమ్

తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆన్ లైన్ డేటాబేస్ లో నకిలీ డాక్టర్లు పేర్లను నమోదు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Identification of fake doctors in TSMC online database .. Case registered cyber crime
Author
Hyderabad, First Published Mar 3, 2022, 12:44 PM IST

తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) నిర్వహించే ఆన్ లైన్ డేటాబేస్ (online database) లో న‌కిలీ డాక్ట‌ర్ల పేర్లు న‌మోదైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై సైబ‌ర్ కైమ్ పోలీసులు (cyber crime police) కేసు న‌మోదు చేశారు. దీనిపై ప్ర‌స్తుతం పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. 

టీఎస్ఎంసీ రిజిస్ట్రార్‌ డాక్టర్ సీహెచ్ హ‌నుమంత రావు (dr.ch hanumantha rao) గ‌త నెల‌లో టీఎస్ఎంసీ డేటాబేస్‌లో నాలుగు వైద్యుల అక్రమ రిజిస్ట్రేషన్లను గమనించారు. దీంతో ఈ వ్య‌వ‌హారంలో ఫిబ్రవరి 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో డాక్ట‌ర్ సీహెచ్ హనుమంత రావు వ‌ద్ద నుంచి పోలీసులు ఇటీవ‌ల వివ‌రాలు సేక‌రించారు.. “ TSMCలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు. డేటాబేస్ లో ఏ త‌ర‌హా న‌కిలీ రిజిస్ట్రేష‌న్లు గుర్తించారు. వంటి ప‌లు వివ‌రాలు అడిగారు’’ అని ఆయ‌న మీడియాతో తెలిపారు. 

ఎలా వెలుగులోకి వ‌చ్చిందంటే ? 
సాధార‌ణంగా మెడికల్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు సొంతంగా ప్రాక్టిస్ మొద‌లు పెట్టాలంటే త‌ప్ప‌ని సరిగా ఈ మెడిక‌ల్ కౌన్సిల్ లో త‌మ పేరు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పేరు న‌మోదు చేసుకున్న త‌రువాత కౌన్సిల్ వారికి ప్ర‌త్యేకమైన నెంబ‌ర్ కేటాయిస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన అనంత‌రమే వారికి ప్రాక్టీస్ అర్హ‌త ల‌భిస్తుంది. దీంతో పాటు ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న డాక్ట‌ర్ త‌రువాతి కాలంలో పీజీ చేసినా, లేక ఏవైనా స్పెష‌లైజేష‌న్స్ పూర్తి చేసినా త‌ప్ప‌కుండా ఈ టీఎస్ఎంసీ డేటా బేస్ లో అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అలాగే ప్ర‌తీ డాక్ట‌ర్ ఈ మెడిక‌ల్ కౌన్సిల్ డేటా బేస్ లో తమ రిజిస్ట్రేష‌న్ ను రెన్యువ‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెగ్యుల‌ర్ గా జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఇటీవ‌లే ఓ న‌లుగురు డాక్ట‌ర్లు టీఎస్ఎంసీకి వ‌చ్చారు. ఇందులో త‌న ఒక‌రు పీజీ ఆప్ డేట్ చేసుకునేందుకు రాగా.. మ‌రో ముగ్గురు త‌మ రిజిస్ట్రేష‌న్ ను రెన్యువ‌ల్ చేసుకునేందుకు వ‌చ్చారు. అయితే అక్క‌డికి వ‌చ్చి డేటాబేస్ లో చూస్తే వారి వివ‌రాలు మ్యాచ్ కాలేదు. దీంతో ఇది వెలుగులోకి వ‌చ్చింది. 

టీఎస్ఎంసీలో డాక్ట‌ర్లు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాలంటే ముందుగా కౌన్సిల్ ఓ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. దాంట్లో పాస్ అయితేనే వారు రిజిస్ట్రేష‌న్ చేసుకోవడానికి అర్హ‌త సాధిస్తారు. అయితే వివిధ ప‌ద్ద‌తుల ద్వారా డాక్ట‌ర్ ప‌ట్టా పొందిన విద్యార్థులు ఇలా ప‌రీక్ష పెడితే పాస్ అయ్యే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే ప‌లు దేశాల్లో డాక్ట‌ర్ విద్య‌ను అభ్య‌సించి వ‌చ్చి ఇక్క‌డ డైరెక్ట్ గా ప్రాక్టీస్ పూర్తి చేయ‌డానికి అనుమ‌తి లేదు. వారు కూడా ఈ కౌన్సిల్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స‌రైన దారిలో వెళితే తాము ప్రాక్టీస్ చేయ‌డానికి అవ‌కాశం ఉండ‌ద‌ని భావించిన వారే ఇలా డేటాబేస్ లో దొడ్డిదారిలో పేర్లు న‌మోదు చేసుకొని ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios