Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో యాంటీబాడీస్ పై రెండో దఫా ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రజల్లో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొనేందుకు గానను ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సర్వే సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నాయి.

ICMR-NIN takes-up second round of sero-survey in Telangana
Author
Hyderabad, First Published Aug 28, 2020, 5:38 PM IST

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రజల్లో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొనేందుకు గానను ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సర్వే సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు మరో రెండు వారాల్లో రానున్నాయి.

తెలంగాణ  రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూడు రోజుల పాటు సర్వే నిర్వహించారు. ప్రతి జిల్లాలో పది గ్రామాల నుండి సీరం శాంపిల్స్ సేకరించారు. మూడు జిల్లాల్లో సుమారు 1200 మంది నుండి రక్త నమూనాలను సేకరించారు.

also read:హైద్రాబాద్‌లో విషాదం:కరోనా వస్తోందనే భయంతో మహిళ ఆత్మహత్య

గత మాసంలో కూడ ఇదే తరహాలో సర్వేనిర్వహించారు.ఈ సర్వేలో కేవలం 3 శాతం మంది ప్రజల్లో మాత్రమే యాంటీబాడీస్ ఉన్నట్టుగా తేలింది. ఈ సర్వే రిపోర్టు కోసం అంతా ఎదురు చూస్తున్నారు. 

60 మంది సిబ్బందితో మూడు రోజుల పాటు 1200 మంది నుండి శాంపిల్స్ సేకరించినట్టుగా ఈ సర్వేకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త లక్ష్మయ్య చెప్పారు. తెలంగాణ ప్రజల్లో 48 శాతం యాంటీబాడీస్ ఉన్నాయో లేవో ఈ సర్వే తేల్చనుంది. 

గత నెలలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఈ నెలలో నిర్వహించే సర్వేకు మధ్య ఏ మేరకు యాంటీబాడీస్ పెరిగాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios