హైదరాబాద్: కరోనా భయంతో హైద్రాబాద్ లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకొంది. కరోనా వస్తే సకాలంలో చికిత్స తీసుకొంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తున్నా ఇంకా కొందరిలో అనవసర అపోహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

హైద్రాబాద్ మలక్ పేట శాలివాహన నగర్ లో విజయ అనే మహిళ తనకు కరోనా సోకుతోందనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

also read:తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం: 5684 మందికి కోవిడ్

విజయ ఇంట్లో అద్దెకు ఉండే వారికి కరోనా సోకింది. దీంతో తనకు కూడ కరోనా సోకే అవకాశం ఉందని భావించిని విజయ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2932 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,17,415కి చేరుకొన్నాయి. రాష్ట్రంలో ఇంకా 28,941 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.