హైదరాబాద్: ఆర్టీసీ జేఎసీ నేతలతో  ఐఎఎస్ అధికారుల కమిటీ శుక్రవారం నాడు  చర్చలను ప్రారంభించింది.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఈ చర్చల్లోనే స్పష్టత రానుంది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని  ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ఇదివరకే సమ్మె నోటీసు ఇచ్చారు. దసరా సందర్భంగా సమ్మెకు వెళ్లకూడదని  వీహెచ్‌పీ నేతలు ఆర్టీసీ జేఎసీ నేతలను కోరారు. పండుగను పురస్కరించుకొని గ్రామాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కార్మికుల డిమాండ్లపై ఐఎఎస్ అధికారుల కమిటీ లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చింది. అయితే ప్రభుత్వంలో విలీనంపై మాత్రం స్పష్టత రాలేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయమై స్పష్టత విషయమై జేఎసీ నేతలు ఐఎఎస్ అధికారులతో చర్చిస్తున్నారు.