ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ: నేడో రేపో ఉత్తర్వులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానిని నియమించుకొనేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ లేదా రేపో ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది.

IAS officer Nilam Sawhney set to become new Andhra Pradesh Chief Secretary

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీని రాష్ట్ర ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది..ఈ మేరకు  అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. బుధవారం  లేదా గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

also Read:వైఎస్ జగన్ కు ఝలక్: మోడీతో ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ తేదీ ఖరారు

కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానీ మూడు రోజుల క్రితం రిలీవ్ అయ్యారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకొనే అవకాశం ఉంది. కేంద్ర సాంఘిక సంక్షేమశాఖ నుంచి ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆమెను రిలీవ్ చేయడంతో త్వరంలోనే నీలం సహానీని సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ ఇద్దరు అధికారుల్లో నీలం సహాని వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో  కలెక్టర్‌గా నీలం సహాని పనిచేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా సహాని సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీ రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య  శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో నీలం సహాని పనిచేశారు. 

Also Read:సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం సీఎంఓ కార్యాలయ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. బిజినెస్ రూల్స్ ను అతిక్రమిస్తున్న విషయమై  ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసు జారీ చేసిన  తర్వాత ఎల్వీ సుబ్రమణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  

ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ పదవికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే విధుల్లో చేరకుండానే ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లిపోయారు. తాత్కాలిక సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లాడు.

అడ్మినిస్ట్రేషన్‌లో నీలం సహానికి మంచి పట్టుంది. దీంతో ఏపీ రాష్ట్రానికి సీఎస్ గా తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో నీలం సహానిని సీఎస్ గా నియమించుకొనే విషయమై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టుగా సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios