నేనే సీఎంగా ఉంటానని కేసీఆర్ తేల్చి చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అన్ని పార్టీ కమిటీలను పూర్తి చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.

also read:ప్రారంభమైన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం: కీలకాంశాలపై చర్చ

రెండున్నర గంటలపాటు  టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విషయంలో  పార్టీ నేతలు తలోరకంగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎందుకలా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సీఎం మార్పు విషయంలో ఎవరూ మాట్లాడొద్దని ఆయన పార్టీ నేతలను కోరారు. ఎవరూ కూడ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆయన సూచించారు.ఈ విషయమై ఎవరూ కూడ మాట్లాడొద్దని పార్టీ నేతలను హెచ్చరించారు.10 ఏళ్ల పాటు సీఎంగా తాను ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.

పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా కూడ తానే సీఎం అని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీ కంటే నాకు ఆత్మీయులు ఇంకెవరూ లేరని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారుమీడియాలో వచ్చిన వార్తలను సీఎం కేసీఆర్  ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నా ా  ఆరోగ్యం సహకరించకపోతే  నేనే మీకు చెబుతానని ఆయన చెప్పారు. ఆ సమయంలో సీఎం అభ్యర్ధిని  ఎవరిని పెట్టాలనే దానిపై మీతో మాట్లాడుతానని కేసీఆర్ పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు.జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక విషయాన్ని కూడ ఆయన ప్రస్తావించారు. సీల్డ్ కవర్లో మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను ప్రకటించనున్నట్టుగా ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ కు ఎవరూ పోటీ కాదని ఆయన చెప్పారు. త్వరలోనే అన్ని కమిటీల ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల్లో కూడా మనమే గెలవాలని ఆయన పార్టీ నేతలకు నొక్కిచెప్పారు. 

సభ్వత్వం విషయంలో టార్గెట్ పూర్తి చేయాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఈ నెల 12 నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి పార్టీ కమిటీల నియామకం ప్రారంభం కానుందన్నారు. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో  అనుసరించాల్సిన వ్యూహాంపై ఆయన పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. 

పార్టీ ఆవిర్భావం తర్వాత సీఎం మార్పు ఉంటుందనే  ఊహగాహనాలు సాగుతున్న తరుణంలో కేసీఆర్  ఈ అనుమానాలను పటాపంచలు చేశారు. కేటీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని సాగుతున్న ప్రచారానికి కేసీఆర్ తెరదించారు.