మహబూబ్‌నగర్: తానంటే  పడనివారే తనకు టిక్కెట్టురాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు.

గురువారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.కాంగ్రెస్‌ పార్టీతో తాను టచ్‌లో ఉన్నట్టుగా ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో  తాను పార్టీ  అధికారిక అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు తాను ప్రయత్నించినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.మహబూబ్‌నగర్ టిక్కెట్టు తనకే వస్తోందని ఆయన  చెప్పారు.టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.  టిక్కెట్టు కేటాయింపు విషయమై తనకు అపనమ్మకం లేదన్నారు.