హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో తాను చెప్పలేనని, ఏపీ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్ర రాజకీయాల గురించి తనకు తెలియదని ఆయన తేల్చి పారేశారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు.  ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానమిచ్చాడు.

ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.